జిల్లాలో నేడు మంత్రి ఎర్రబెల్లి పర్యటన

Mon,July 15, 2019 02:24 AM

మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో నేడు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించనున్నారు. హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి ఉదయం 6గంటలకు బయలు దేరుతారు. జనగాం, దేవరుప్పల నుంచి వయా తొర్రూరు మీదుగా నెల్లికుదురు మండల కేంద్రానికి చేరుకుంటారు. ఉదయం 10.30గంటలకు నెల్లికుదురు మండలం కేంద్రంలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.20గంటలకు మహబూబాబాద్‌ పట్టణానికి చేరుకుంటారు. గుమ్మడూరులోని 6 ఎకరాల స్థలంలో 160 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ ఇప్పటికే 9ఎకరాల స్థలంలో 200 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇదే ప్రాంతంలో మరో 160 ఇళ్లకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12గంటలకు మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని జరగే అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం మహబూబాబాద్‌ నుంచి తిరిగి హన్మకొండలోని రాంనగర్‌లోని మంత్రి ఎర్రబెల్లి నివాసానికి చేరుకుంటారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటన నేపథ్యంలో కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్య ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం ఉదయం మహబూబాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు గుమ్మడూర్‌లోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి సమీక్షించనున్నందున అన్ని శాఖలకు చెందిన అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
సోమవారం జిల్లాలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులతో పాటు మున్సిపల్‌ శాఖ సమీక్ష నిర్వహించనున్నారు. నెల్లికుదురు మండలం కేంద్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, అదే విధంగా మహబూబాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో రోడ్డుపనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా గుమ్మడూరులో డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మున్సిపాలిటీతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులతో మంత్రి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించనున్నారు.

మంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు..
జిల్లాలో సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రి పర్యటనలో భాగంగా బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ క్యాంపు కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలుకనున్నారు. అనంతరం అక్కడి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రోడ్డు వైడనింగ్‌ పనులకు శంకుస్థాపన, గుమ్మడూరులోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. సోమవారం మంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles