తేడా వస్తే సహించేది లేదు..

Wed,July 17, 2019 06:06 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, జూలై 16 : తేడా వస్తే ఏ మాత్రం సహించేది లేదని మరిపెడ మున్సిపల్ అధికారులను డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్‌తో పాటు ఆ కార్యాలయ అధికారులు, సిబ్బందితో రెడ్యానాయక్ మరిపెడ మున్సిపల్ సమస్యలపై స్థానిక విశ్రాంతి భవన్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ అధికారులతో మాట్లాడుతూ.. పట్టణంతో పాటు అన్ని ఆవాస ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్ల ఏర్పాట్లపై ఆరా తీశారు. మొత్తం 14వందల స్తంభాలకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారంలోపే ఈ పని పూర్తి చేయాలని కమిషనర్ రాజేశ్వర్‌ను కోరారు. అవసరమైతే ప్రైవేట్ ఎలక్ట్రిక్ సిబ్బందిని డైలీ వేజ్ ఇచ్చి ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదే విధంగా అన్ని వాడల్లో పేరుకపోయిన చెత్తను తొలగించి పట్టణాన్ని సుందరంగా ఉంచాలన్నారు. పనిచేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని తండాలు, వాడల్లోకి మిషన్ భగీరథ నీళ్లు వెళ్లాలన్నారు. ఏ ఒక్క వీధి నుంచి కూడా ఫిర్యాదులు ఉండొద్దన్నారు. నిధులు ఎన్నైన మంజూరు చేయించే పూచీ తనదేనని చెప్పారు. జాగ్రత్తగా పని చేస్తే సమస్యలు ఉండవన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నవీన్, మరిపెడ మాజీ సర్పంచ్ పానుగోత్ రాంలాల్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, జిల్లా రైతు సమితి సభ్యుడు కాలునాయక్, మాజీ ఎంపీటీసీలు అంబరీష, వస్రాం, రూప్లా, నాయకులు బాలాజీ, గూడూరు శ్రీనివాస్, దేశ్యాతండా వెంకన్న, దిగిజర్ల శ్రీనివాస్, నాన్యనాయక్, ఉల్లెపల్లి సర్పంచ్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే రెడ్యానాయక్ మరిపెడ మండలంలోని భాల్నిధర్మారం గ్రామానికి చెందిన వెంకన్న, విజయలక్ష్మి, రమణారెడ్డి, మరిపెడబంగ్లాకు చెందిన యాదమ్మ, పీఎస్‌గూడెంకు చెందిన భరత్, తండాధర్మారం గ్రామానికి చెందిన ఎల్ రమేశ్ తదితరులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles