గుండెలనిండా. గులాబీ జెండా

Wed,July 17, 2019 06:08 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు పల్లెపల్లెన పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. ప్రజలు స్వచ్ఛంధంగా ముందు కు వచ్చి సభ్యత్వాలు స్వీకరిస్తున్నారు. గత నెల 27న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంబించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం తుది దశకు చేరుకుంది. ఈనెల 20లోపు సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికి, అంతకు ముందే పూర్తి చేయాలని జిల్లా నాయకులు బావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 80శాతానికి పైగా సభ్యత్వాలు పూర్తి చేశారు. రానున్న రోజుల్లో 100శాతం పూర్తి చేసే విదంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ముందుకు సాగుతున్నారు. సభ్యత్వ నమోదుపై టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే శ్రేణులకు ఏ రోజుకు ఆ రోజు పలు సూచనలు చేస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం తుది గడువు దగ్గర పడుతుండటంతో శ్రేణులంతా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజిబిజిగా ఉన్నారు. జిల్లాలో 16మండలాల నుంచి 1.77లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 1.40లక్షల సభ్యత్వాలను పూర్తి చేశారు. ఇంకా మిగిలి ఉన్న 37వేల సభ్యత్వాలను నాలుగైదు రోజుల్లో పూర్తి చేసేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు జోరుగా సభ్యత్వ నమోదులో పాల్గొంటున్నారు. ఇందుకోసం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ నాయకులు, నియోజకవర్గాలకు చెందిన ఇంచార్జులు సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా పూర్తి చేసిన సభ్యత్వాలకు సంబందించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఏ రోజు సభ్యత్వాలు పూర్తి చేసిన వాటిని అదే రోజు ఆన్‌లైన్ ప్రక్రియ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామ స్థాయి నుంచి మొదలు కొంటే జిల్లా స్థాయి వరకు టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తుది దశకు చేరింది. ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికి ఈ లోగా పూర్తి చేయాలని నాయకులు బావిస్తున్నారు. సభ్యత్వ నమోదు పూర్తి కాగానే గ్రామ, మండల కమిటీలు వేయనున్నారు. పార్టీ కోసం అంకితమై పని చేసే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులను గుర్తించి కమిటీలలో అత్యంత ప్రాధాన్యత ఉండే పదవులను అప్పగించనున్నారు. వివిద స్థాయిల్లో పార్టీకి సేవలు అందిస్తున్న వారిని గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చూస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలో టీఆర్‌ఎస్ కార్యాలయానికి ఎకరం స్థలం కేటాయించారు. కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కూడ నిర్వహించారు. పార్టీ నిర్మాణం పటిష్టంగా చేపట్టాలని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు దృడ సంకల్పంతో ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి మొదలు కొంటే జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత పటిష్టం చేయనున్నారు.

20వ తేదీ తర్వాత కమిటీలు..
సభ్యత్వ నమోదు కార్యక్రమం తుదిదశకు చేరుకుంది. సభ్యత్వనమోదు పూర్తి కాగానే టీఆర్‌ఎస్ మండల, గ్రామ కమిటీలను ఎన్నుకోనున్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ముగిసిన తరువాత గ్రామ, మండల కమీటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 16మండలాల్లో సభ్యత్వాలు తుదిదశకు చేరుకున్నాయి. నాలుగైదు రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి కానుంది.వచ్చిన సభ్యత్వాలను రోజు ఆన్‌లైన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే గ్రామ, మండల కమిటీలను ఎన్నుకోనున్నారు. పార్టీతో పాటు పార్టీ అనుబంధ సంఘాలకు సంబందించిన కమిటీలను కూడ ఎన్నుకుంటారు. టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించడంతో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కష్టపడిన వారికి త్వరలో పార్టీ పదవులు వస్తుండటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సభ్యత్వ నమోదు తుది దశకు చేరుకోవడంతో గ్రామ, మండల కమిటీలపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామ, మండల కమిటీలపై కసరత్తు ప్రారంబించారు.

సభ్యత్వ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు..
పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఏ రోజు చేసినా సభ్యత్వాలను ఆరోజునే సంబందిత నియోజకవర్గ కేంద్రంలో అప్పగిస్తున్నారు. వచ్చిన సభ్యత్వాలను వచ్చినట్టు నియోజకవర్గ కేంద్రంలో కంప్యూటర్‌లో నమోదు చేసి ఆన్‌లైన్ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తుది దశకు చేరుకుంది. వచ్చిన సభ్యత్వాలను ఏ రోజు వచ్చినవి అదే రోజున కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ ప్రక్రియ ఎప్పటికప్పుడే పూర్తి అవుతుంది. సభ్యత్వాల నమోదు తరువాత గ్రామ, మండల, కమిటీలను ఎన్నుకోనున్నారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పార్టీ నాయకులు సకాలంలో పూర్తి చేసే విదంగా ముందుకు సాగుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి అయ్యాక టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ, డివిజన్, మండల, కమిటీలతో పాటు అనుబంధ కమిటీల నియామకాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles