టీఆర్‌ఎస్‌ను బలమైన శక్తిగా నిలపాలి


Sun,July 14, 2019 01:14 AM

దండేపల్లి: టీఆర్‌ఎస్ మరింత బలమైన శక్తిగా ఎదిగేందుకు గ్రామ స్థాయి నుంచి టీఆర్‌ఎస్ సభ్వత్యాలను పెంచాలనీ, పార్టీ కార్యకర్తలకు ఎప్పు డూ అండగా ఉంటుందని మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల ఇన్‌చార్జి మూల విజయారెడ్డి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. టీఆర్ ఎస్ సభ్యత్వ నమోదులో భాగంగా దండేపల్లి మండలం తాళ్లపేటలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సభ్యత్వం ఇచ్చా రు. తాళ్లపేట, రాజుగూడ సర్పంచులు కళావతి, లచ్చుపటేల్‌కు సభ్వత్య రసీదు అందించారు. అనంతరం మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు సభ్వత్యం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్క రూ సభ్యత్వం తీసుకొని బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తే ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారన్నారు. సభ్యత్వం తీసుకున్న వారి వివరాలు పూర్తిగా ఉండాలని సూచించారు. పార్టీ సభ్వత్వాల నమోదు రెండు విధాలుగా ఉం టుందని రూ.100తో క్రియాశీల సభ్వత్యం, రూ. 50తో సాధారణ సభ్వత్యం చేయాలని పేర్కొ న్నారు. సభ్వత్యం తీసుకున్న కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షల బీమా అందిస్తారన్నారు. టీఆర్‌ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్‌కుమార్, మాజీ వైస్‌ఎంపీపీ ఆకుల రాజేందర్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శు లు బండారి మల్లేశ్, రేని శ్రీనివాస్, తాళ్లపేట, రాజుగూడ సర్పంచులు కుర్సెంగ కళావతి, లచ్చుపటేల్, ఉపసర్పంచులు పుట్టపాక తిరుపతి, బట్టు రాజయ్య, టీఆర్‌ఎస్ నాయకులు ముత్తె రాజన్న, మాడ దయాకర్, ఉస్మాన్‌ఖాన్, లక్ష్మణ్‌గౌడ్, నలిమెల మహేశ్, బోడ నర్సింగ్, గుమ్మడి రవి, తదితరులు పాల్గొన్నారు.

కలిసికట్టుగా లక్ష్యం చేరుకోవాలి
సభ్వత్య నమోదులో కలిసికట్టుగా లక్ష్యం చేరుకోవాలని ఇన్‌చార్జి మూల విజయారెడ్డి అన్నారు. నియోజకవర్గ లక్ష్యం 50వేలు కాగా మండల లక్ష్యం 10వేలు అని తెలిపారు. పార్టీకి కార్యకర్తలే బలమని అందుకు తగ్గట్లు పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ కుటుంబంలో ప్రతి ఒక్కరిని చేర్చుకునేలా కష్టపడి పనిచేయాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతో సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్ష్యం చేరుకోవాలన్నారు.

బంగారు తెలంగాణే లక్ష్యం
తెలంగాణ రథసారథి సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కోసమే కృషి చేస్తున్నారని ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌తో ఇప్పటికే గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. కుట్టి ప్రాజెక్ట్ పూర్తయితే కడెం ప్రాజెక్టు ద్వారా రెండు పంటలకు నీళ్లు అందుతాయని హామీ ఇచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు గ్రామస్థాయి కార్యకర్తలు కూడా ప్రచారం చేయాలన్నారు. మిత్రులు, బంధువుల కు పార్టీ గురించి వివరించి మూడు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా రెపరెపలాడించాలన్నారు.

లింగాపూర్‌లో
లింగాపూర్‌లో ఎమ్మెల్యే సభ్యత్వ నమోదు చేపట్టారు. పలువురికి సభ్యత్వాలు అందించారు. స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు హరినాయక్, బోడ నర్సింగ్, ఉపారపు లింగయ్య, బచ్చల అంజన్న, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...