అన్నదాతకు అండగా ప్రభుత్వం


Sun,July 14, 2019 01:14 AM

మంచిర్యాల అగ్రికల్చర్ : రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు అంతా సిద్ధం చేసింది. జిల్లాలోని 2,572 మంది రైతులకు చెందిన 1,173. 117 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. వారికి ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1,16,25,445ని వచ్చే వారంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. పత్తి పూత కొస్తున్న సమయం, వరి ఎదిగే సమయంలో కుండపోత వర్షాలు పడడంతో రైతు లు నష్టపోయారు. వారం రోజుల పాటు ఎడతెరిపిలేకుండా వర్షాలు పడటంతో వరి పొలా లు కోతకు గురి కాగా, పత్తి మొక్కలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో ఇసుక మేట లు వేశాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభు త్వం దృష్టి సారించింది. పంట నష్టం అంచనా వేయించగా, రైతులకు డబ్బులు అందజేసేందుకు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయాధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే వారి ఖాతా ల్లో జమ చేస్తామని వెల్లడిస్తున్నారు.పంటలకు బీమా చేసుకోవడం ద్వారానే పరిహారాన్ని పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.

గత ఏడాది ఖరీఫ్‌లో 1.39 లక్షల ఎకరాలలో పత్తి, 98 వేల ఎకరాలలో వరి, 10 వేల ఎకరాలలో ఇతర పంటలు సాగు చేశారు. 11,997 మంది పత్తి రైతులు 11,322.56 ఎకరాలకు, వరి పంటకు 36,244 మంది రైతులు 75,926.69 ఎకరాలకు, కంది పంట కు ఆరుగురు రైతులు 4.99 ఎకరాలకు, మిరపకు ఆరుగురు రైతులు 6.85 ఎకరాలకు బీమా చేయించారు. 48,253 మంది రైతులు ఖరీఫ్‌లో 90,095. 57 ఎకరాలకు బీమా చేశారు. కాని గత ఏడాది ఆగస్టు 10 నుంచి 14 వరకు కురిసిన వర్షంతో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. అధికారులు సర్వే నిర్వహించి 33 శాతం కన్నా ఎక్కువ నష్టపోయిన పంటలు 588.28 హెక్టార్లలో పత్తి, 391.52 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. వీటితోపాటు 3.49 హెక్టార్లలో కంది, ఇతర పంటలు దెబ్బతిన్నాయని, ఇలా మొత్తం 2,572 మంది రైతులకు చెందిన 1,173.117 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించి సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. స్పందించిన ప్రభుత్వం రైతులకు రూ. 1,16,25,445 వారి వారి ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.

బ్యాంకు ఖాతా నంబర్లు సేకరిస్తున్నాం
ప్రకృతి బీభత్సం వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, జైపూ ర్, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల మం డలాల్లో అధిక వర్షం వలన పంటలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి. జిల్లాలోని 17 మండలాల్లో అధికారులు సర్వే చేసి 33 శాతం కంటే ఎక్కువ మొత్తంలో దెబ్బతిన్న పంటల రిపోర్టు ప్రభుత్వానికి పంపించగా ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. రైతుల వారీగా బ్యాంకు ఖాతాల నంబర్లు సేకరిస్తున్నాం. త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి.ప్రతి రైతు తమ పంటలకు బీమా చేయించుకోవడం ఉత్తమం.
- వుల్లోజు వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి, మంచిర్యాల

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...