వేలిముద్ర వేస్తేనే ఎరువులు


Mon,July 15, 2019 01:17 AM

-ఈ-పాస్‌ మిషన్‌ ద్వారా పంపిణీ
-వేలిముద్ర, ఆధార్‌తోనే బస్తా అందజేత
-పకడ్బందీగా అమలుకు చర్యలు
-డీలర్లు, సహకార సంఘాల సీఈఓలకు పూర్తయిన శిక్షణ
మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఎరువుల విక్రయాల్లో అవక తవకలు, అక్రమాలు ఇక చెల్లవు. ఈమేరకు ఈ ఖరీఫ్‌ నుంచే ఈ-పాస్‌ మిషన్‌ ద్వారా ఎరువులు, విత్తనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలోని 225మంది డీలర్లకు ఈ మిషన్లు పంపిణీ చేయడంతో పాటు వాటి విని యోగం పైనా శిక్షణ ఇచ్చింది.
నాడు ఎరువుల కోసం పరుగులు..
రైతులు వానాకాలం, యాసంగి సీజన్లు ప్రారంభమ య్యాయంటే చాలు ఎరువుల కోసం పరుగులు పె ట్టేవారు. ముందుగా దుక్కిలో వేసే ఎరువుల నుంచి విత్తనాలు విత్తి, పంట ఎదిగే వరకు ఎరువులు అ వ సరమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతు పంట పండించాలంటే ఎరువులు తప్పని సరిగా మారా యి. అందుకే ఫర్టిలైజర్‌ దుకాణాల ఎదుట క్యూలై న్లు కట్టి దొరికే వరకు పడిగాపులు కాసేవారు. గత ప్రభుత్వ హయాంలో ఎరువులు దొరకక రైతులు రో డ్డెక్కి లాఠీల దెబ్బలు తినేవారు.
స్వరాష్ట్రంలో మారిన పరిస్థితి..
టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం వచ్చాక రైతుల అవసరాలను ముందే గుర్తించి ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటోంది. అన్ని సహకార సంఘాలు, ఎరు వుల డీలర్ల వద్ద నిలువ ఉండేలా చర్యలు తీసుకొం టోంది. అంతేగాక ఎరువుల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఈ-పాస్‌ వి ధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో అవసరమైన ఎరువులు అందుతున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమాలకు అడ్డుకట్ట..
గతంలో రైతులకు బదులుగా ఇతర వ్యాపారులు యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు తీ సుకెళ్లి కృత్రిమ కొరత సృష్టించేవారు. ముఖ్యంగా కల్తీ కల్లు, కల్తీ పాల తయారీలో యూరియాను వి నియోగించే వారు. మరికొందరు కల్తీ ఎరువుల వ్యా పారులు ఇష్టమొచ్చినట్లు కొనుగోలు చేసి వాటిని ఇతర పదార్థాలతో మిశ్రమం చేసి తిరిగి మార్కెట్లోకి నాసిరకాలను విక్రయించేవారు. ఇలా రైతులు వాటిని కొనుగోలు చేసి పంట పొలాల్లో వేస్తే దిగుబ డి రాకపోయేది. అంతే కాకుండా రైతులు ఆశించిన పంటలు పండక నష్టాలను చవిచూసేవారు. ఇలాం టి సమస్యలను గుర్తించిన ప్రభుత్వం రైతు వేలి ముద్ర వేస్తేనే అవసరమైన ఎరువుల బస్తాలను మా త్రమే విక్రయించేందుకు ఈ-పాస్‌ యంత్రాలను తీ సుకొచ్చింది. ఎరువులు పక్కదారి పట్టకుండా ప క డ్బందీగా ఎరువులు అందేలా చర్యలు చేపట్టింది.

ఈ పాస్‌ ద్వారా అమ్మితేనే నగదు బదిలీ..
రైతులు ఈ-పాస్‌ ద్వారా ఎరువులు కొంటేనే చేస్తేనే కేంద్రం నేరుగా నగదు బదిలీ విధానంతో కం పెనీ లకు రాయితీలను జమచేయనుంది. గతంలో మా ర్క్‌ఫెడ్‌ నుంచి డీలర్లకు ఎరువులు వచ్చే సమయం లో పీఓఎస్‌ మిషన్‌ల ద్వారా విక్రయాలు జరిగేవి కావు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌లో సైతం ఈ విధానం అమలుచేయడంతో బస్తా బస్తాకు అమ్మకం ఆధా రంగా కంపెనీలకు రాయితీ జమవుతుంది. మరో వైపు వరుసగా మూడు నెలలు ఎరువులు అ మ్మని వ్యాపారిపై విచారణ చేపట్టనున్నారు. చిల్లర వ్యాపారి నెలకోసారి ఎన్ని విక్రయించారో తెలియజే స్తూ నివేదికను వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సి ఉం టుంది. వ్యవసాయ శాఖ అధికారి తనిఖీ చేసే సమ యంలో అక్కడ ఉన్న స్టాకు పీవోఎస్‌ యంత్రంలో కనిపించే నిలువల లెక్కలు సరిపోవాలి. తేడాలుంటే వెంటనే లైసెన్సు రద్దు చేయనున్నారు. హోల్‌సేల్‌ డీలర్లు స్టాకును బ్లాక్‌ చేసి అధిక ధరలకు విక్రయిం చకుండా అధిక నిలువలు పెట్టకుండా ఎప్పటి కప్పు డు రిటైల్‌ వ్యాపారులకు పంపేలా చర్యలు తీసు కుంటారు. వారు సైతం నిలువలను ఎప్పటికప్పు డు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రతిరోజు అత్యధి కం గా ఎరువులు కొనేవారి జాబితాలు తయారు చేసి వారి వివరాలు సేకరించి వారిని గమనించను న్నా రు. రిటైల్‌ వ్యాపారితో పాటు ఫ్యాక్స్‌, డీసీఎం ఎస్‌ సిబ్బంది సాగించే విక్రయాలపై నిఘా పెట్టి లొ సుగు లుంటే వెంటనే కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ఆధార్‌ కార్డు తప్పనిసరి
ఏటా రైతులకు ఇచ్చే ఎరువులు పక్కదారి పడు తు న్నాయని ప్రభుత్వం పీఓఎస్‌ విధానం తీసుకొచ్చిం ది. దీని ద్వారా విక్రయిస్తేనే ప్రభుత్వం అందించే స బ్సిడీ పోగా ఎంత ధర(ప్రస్తుతం ఉన్న ధర) అయితే ఉందో అంతే చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ధర చెల్లించాల్సిన అవసరం లేదు. ఎరువు ల కోసం ఫర్టిలైజర్‌ దుకాణానికి రైతులు వెళ్లిన ప్పుడు తప్ప కుండా ఆధార్‌ కార్డు జిరాక్స్‌, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌ తీసుకెళ్లి పీఓఎస్‌తో ఎరువులు కొనాలి. ఈ విధానం ద్వారా రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత ఫర్టిలైజర్‌ అవసరమనేది వివరాలు తె లిసిపోతాయి. పంటలకు అనుగుణంగా ఎరువులను అందించవచ్చు. మున్ముందు ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీ మాదిరి ఎరువుల సబ్సిడీ నేరుగా జమకానుంది.
- వుల్లోజు వినోద్‌కుమార్‌, డీఏఓ, మంచిర్యాల

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...