క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నాం


Sun,July 14, 2019 12:08 AM

-ఎమ్మెల్సీ భానుప్రసాద్ వెల్లడి
-ప్రారంభమైన సౌత్ ఇండియా ఫుట్‌బాల్ టెన్నిస్ పోటీలు
వనస్థలిపురం : తెలంగాణలో క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్నామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్నారు. సౌత్ ఇండియా ఫుట్‌బాల టెన్సిస్ చాంపియన్‌షిప్-2019 శనివారం ప్రారంభమైంది. వనస్థలిపురం జీఎంఆర్ టెన్నిస్ అకాడమీలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఐఆర్‌ఎస్ అధికారి రాకేశ్ క్రిష్టఫర్, స్థానిక కార్పొరేటర్ లక్ష్మీప్రసన్నతో కలిసి ఆయన ప్రారంభించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. 7 రాష్ర్టాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారన్నారు. పోటీలను నిర్వహిస్తున్న తెలంగాణ ఫుట్‌బాల్ టెన్నిస్ అసోసియేషన్, ఓర్టెక్స్ స్పోర్టింగ్ సంస్థలను అభినందించారు. క్రీడా కారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పేరు సంపాదించాలన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలకు నగరం వేదికగా మారుతుందన్నారు. తెలంగాణ ఫుట్‌బాల్ టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.బాలరాము లు మాట్లాడుతూ 1920లో మొదటిసారి ఈ ఆటను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుత పోటీ ల్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, గోవా, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ర్టాలకు చెందిన మహిళలు, పురుష క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. క్రీడను విస్తరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, ప్రజలు ఆదరించాలని కోరారు. అసోసియేషన అధ్యక్షుడు రమేశ్, వినోద్ యాదవ్, యాదగిరి, బాల మురళీ, ప్రవీణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...