‘విద్యార్థులు లక్ష్యంతో చదవాలి’


Mon,July 15, 2019 12:36 AM

కాచిగూడ : విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగినప్పుడే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని, ఆ దిశగా నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ఉస్మానియా మాజీ వీసీ, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌ వేదుల రామకృష్ణయ్య అన్నారు. కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కాచిగూడ మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో ఆదివారం మెరిట్‌ అవార్డ్స్‌-2019 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎంఆర్‌ వెంకట్‌రావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా రామకృష్ణయ్య హాజరై 380 మంది విద్యార్థులకు మెరిట్‌ అవార్డ్స్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివినప్పుడే ఏ రంగంలోనైనా రాణించగలరని సూచించారు. విద్యార్థులు కొత్త ఆలోచనలతో దేశ అభివృద్ధి, సమాజ ప్రగతికి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డు సభ్యుడు చంద్రమోహన్‌ పారిశ్రామిక వేత్త మ్యాడం కిషన్‌రావు, పాండు రంగారావు, విష్ణువర్ధన్‌, జెల్లి సిద్ధయ్య, కల్వకుంట్ల శ్రీనివాస్‌, రమణాకర్‌, రవీందర్‌, శ్రీకాంత్‌, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...