గ్యాస్‌తో కాలుష్య కట్టడి


Mon,July 15, 2019 12:38 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వాయుకాలుష్యం ఈ మాటవినగానే భారీ కార్ఖానాల్లోని ఎత్తయిన గొట్టాల నుంచి వెలువడే పొగలే గుర్తుకొస్తాయి. అవు ను నిజమే.. గొట్టాల నుంచి వెలువడే కర్బన ఉద్ఘారాలు పర్యావరణానికి హాని తలపెడుతున్నాయి. కాలు ష్య కాసారంగా మార్చేస్తున్నాయి. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కొత్త మార్గాలను అనుసరిస్తున్నది. పరిశ్రమల్లో కాలుష్య రహిత ఇందనమైన సంపీడన సహజ వాయువు (సీఎన్‌జీ) పెట్రోలియం సహజ వాయువు (పీఎన్‌జీ)ల వాడకాన్ని ప్రొత్సహిస్తున్నది. దీంట్లో భాగంగా ఇటీ వలే పీసీబీ సభ్యకార్యదర్శి వి. అనిల్‌కుమార్‌, ఇటీవలే పారిశ్రామికవేత్తలు, గ్యాస్‌ సరఫరాదారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. పరి శ్రమల్లో సీఎన్‌జీ, పీఎన్‌జీ వాడకాన్ని ప్రొత్సహించాలని సూచించారు. గ్రేటర్‌ సహా శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో బల్క్‌డ్రగ్‌, ఫార్మా, గ్లాస్‌, సిమెం ట్‌, ఇనుము తయారీ పరిశ్రమలున్నాయి. వీటిలో ఉత్పాదక సమయంలో బాయిలర్లు, ఫర్నేసులను ఉష్టాన్ని ఉత్పత్తి చేయడం కోసం బొగ్గు, డీజిల్‌ను విరివిగా వాడుతున్నారు. తక్కువ ధరకు బొగ్గు దొరుకుతుండటంతో అధికంగా కాల్చుతూ కాలుష్యానికి కారకులవుతున్నారు. నగరాన్ని పట్టిపీడి స్తున్న కర్బన ఉద్ఘారాలకు ఇదే ప్రధాన కారణం. పరిశ్రమల నుంచి వెలు వడుతున్న పొగలతో ఆయా ప్రాంతాల్లోని వారంతా అనారోగ్యం భారిన పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో కాలుష్య స్థాయిల్లోనూ తేడాలుంటున్నాయి. బొగ్గు కారణంగా, ఘన వ్యర్థాలు, దుమ్మ ధూళి కణాలు సైతం పోగవుతున్నాయి.

వాడుతున్నది 25 వేల కిలోలే..
గ్రేటర్‌లో ప్రస్తుతానికి 42 వేల కిలోల సీఎన్‌జీ గ్యాస్‌ అందుబాటులో ఉండగా, 25 వేల కిలోల గ్యాస్‌ మా త్రమే వినియోగమవుతోంది. నగరంలోని 17 పరిశ్రమలు ఇప్పటికే గ్యాస్‌ను వినియోగిస్తూ ఉత్పత్తి చేస్తున్నాయి. ఏజీఐ గ్లాస్‌ ఫ్యాక్టరీ నిర్వహకులు, గాజు తయారీ సమయంలో పూర్తిగా సీఎన్‌జీ గ్యాస్‌ ను వినియోగిస్తున్నారు. బొగ్గు వాడకంతో వెలువడిన ఉష్ణశక్తి కంటే గ్యాస్‌ నుంచే అధిక శక్తి విడుదలవుతండటం, పైగా కాలుష్యరహితం కావ డంతో వీరంతా గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. అయి తే పరిశ్రమల అవసరాను తీర్చేందుకు గాను ప్రత్యేక లైపులైన్ల ద్వారా గ్యాస్‌ను సరఫరా చేయబోతున్నా రు. సహజ వాయువును నగరానికి సరఫరా చేస్తున్న భాగ్యనగర్‌ గ్యాల్‌ లిమిటెడ్‌ కంపెనీ( బీజీసీఎల్‌) నగరంలో పలు ప్రాంతాల్లో సీఎన్‌జీ గ్యాస్‌ పైపున్ల వేయబోతున్నారు. ప్రస్తుతానికి బాలానగర్‌, జీడిమెట్ల పారిశ్రామిక వాడలకు, తర్వాత రోజుల్లో పటాన్‌చెరు వరకు పైపులైను వేసేందుకు బీజీసీఎల్‌ వర్గాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీని వల్ల పర్యావరణానికి మేలు చేయడంతో పాటు ఉత్పాదక ఖర్చులను తగ్గించుకున్నట్లవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...