మొక్కలు ఎందుకు అందించలేదు... అధికారులపై కలెక్టర్ ఆగ్రహం


Wed,July 17, 2019 03:23 AM

మేడ్చల్ కలెక్టరేట్: ఇంటింటికి అవసరమయ్యే పూల, పండ్ల మొక్కలను అందించాలని అధికారులను మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుండి మంగళవారం ఎంపీడీఓలు, ము న్సిపల్ కమిషనర్లు, సిడిపిఓలు, సూపర్‌వైజర్లు, పంచాయతీకార్యదర్శులతో హరితహారం, మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, అంగన్‌వా డీ కేంద్రాల నిర్వహణపై కలెక్టర్ ఎంవీ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. వర్షాకాలం మొక్కలు నాటడానికి సరైన సమయమని వెంటనే మొక్క లు నాటితే చక్కగా పెరుగుతాయని చెప్పారు. వర్షాకాలం మొదలై నెల రోజులైన గ్రామాల వారీగా ఇంకా మొక్కలు అందించనందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి, రైతులు పోలాల్లో పెట్టడానికి, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లక్ష్యం మేరకు మొక్కలు అందించాలని సూచించారు. ఏవెన్యూ, ఐకానిక్ ప్లాంటేషన్ చేయుటకు గుర్తిం పు పోందిన ఏజెన్సిలతో అగ్రిమెంట్ చేసుకొని వెంటనే ప్లాంటేషన్ మొదలు పెట్టి పకడ్బందిగా చేయాలని సూచించారు. ఎలక్షన్ కోడ్ రాకముం దే ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ఏవెన్యూ ప్లాటేషన్ చేయించాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికలపై మాట్లాడుతూ ఈ నెల 18న పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనంతరం రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పా టు చేసుకొని పోలింగ్ కేంద్రాలపై వచ్చే అభ్యంతరాలు ఉంటే సరిచేసి ఈ నెల 21న పోలింగ్ కేంద్రాల ఫైనల్ పబ్లికేషన్ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. వార్డుల వారిగా ఎస్ టీ, ఎస్సీ, బీసీ, మహిళ ఓటర్ల జాబితాను తయా రు చేసేటప్పుడు ఎలాంటి పోరపాట్లు చేయవద్దని, మున్సిపల్ కమిషనర్లు సంతకం చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం నర్సరీ డైరెక్టరి బ్రోచర్‌ను కలెక్టర్ అవిష్కరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ మధుకర్‌రెడ్డి, డీపీఓ రవికుమార్, డీఆర్‌డీఓ కౌటిల్యా, డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి, జిల్లా మహిళ శిశుసంక్షేమ శాఖ అధికారి స్వరూప, అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...