ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి

Tue,July 9, 2019 01:39 AM

భూపాలపల్లి రూరల్, జూలై 8: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు అందేలా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కృషి చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణీ ఆదేశించారు. జిల్లా పరిషత్ నూతన పాలక వర్గాన్ని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎంపీడీవోలు సోమవారం ఘనంగా సన్మానించారు. జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణీ, వైస్ చైర్‌పర్సన్ కల్లెపు శోభ, జెడ్పీ సీఈవో శిరీషలకు ఎంపీడీవోలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి, సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద ప్రజల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఆ పథకాల ఫలాలను పేదలకు అందించేలా అధికార, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని కోరారు. ప్రజలకు సేవలందించే విషయంలో ఎవరూ అలసత్వం వహించవద్దని ఈ సందర్భంగా వారు సూచించారు. కార్యక్రమం లో సంఘం నాయకులు అనిల్‌కుమార్, రజిత, జెడ్పీ ఉద్యోగులు పాల్గొన్నారు.

17
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles