స్కూల్ గ్రాంట్ నిధులు విడుదల

Wed,July 10, 2019 01:29 AM

ములుగు జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యపై ప్రత్యేక దృష్టిని సారించింది. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తోంది. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన అమలు, పాఠశాలల్లో స్టేషనరీ, గ్రంథాలయ, క్రీడా, కార్యాలయ నిర్వహణకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తోం ది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణతో పాటు ప్రత్యేక ప్రయోగాలపై దృష్టి సారిస్తోంది. పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం పాఠశాలలకు అందించే స్కూల్ గ్రాంట్ నిధులను ఈ విద్యా సంవత్సరానికిగాను పాఠశాలలు ప్రారంభమైన నెల రోజుల్లోనే మంజూరు చేసింది. దీంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్కూల్ గ్రాంట్ నిధుల విడుదల..
గతంలో ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ అందించే స్కూల్ గ్రాంట్ నిధులు మూడు విడతల్లో అందేవి. ఆ నిధుల కోసం ఉపాధ్యాయులు ఎదురు చూసే వారు. ఒక్కో సందర్భంలో గతం లో స్కూల్ గ్రాంట్ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియని పరిస్థితిల్లో ఉపాధ్యాయు లు అరకొర మౌలిక వసతుల మధ్యన విద్యాబోధన చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం ఆ విధానికి చెక్ పెట్టింది. పాఠశాలల బలోపేతం, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పాఠశాలలకు అందించే నిధులను సకాలంలో అందిస్తోంది.
తద్వారా ఉపాధ్యాయులకు అన్ని రకాల మౌలిక వసతులను అందుబాటులో ఉంచి వి ద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తోడ్పాటును అందిస్తోంది. ఈ క్రమంలోనే ఈ విద్యా సంవ త్సం ప్రారంభమైన నెల రోజుల్లోనే మొదటి విడ త స్కూల్ గ్రాం ట్ నిధులను విడుదల చేసింది. పాఠశాలలకు కావాల్సిన స్టేషనరీ ఇతర వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలను కల్పించింది.

ఉపాధ్యాయుల హర్షం..
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఖర్చు చేసే స్కూల్ గ్రాంట్ నిధులను మొదటి విడతకు గాను పాఠశాలలు ప్రారంభమైన నెల రోజుల్లోనే విడుదల చేయడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తుగానే నిధులు విడుదల చేయడం వల్ల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మేలు చేకూరుతుందని పలువురు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

328 పాఠశాలలకు మంజూరు..
ములుగు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు విడుదల చేసే స్కూల్ గ్రాంట్ నిధులను మొదటి విడుత 328పాఠశాలలకు నిధులను విడుదల చేసింది. పాఠశాలల విద్యార్థులకు అవసరమ య్యే విద్యుత్ సరఫరా, క్రీడా సామగ్రి, కార్యాలయానికి కావాల్సిన స్టేషనరీ, గ్రంథాలయ నిర్వహణకు పుస్తకాల కొనుగోలు, ఉపాధ్యాయుల టీఎల్‌ఎం శిక్షణకు ఈ నిధులు వినియో గించనున్నారు. మొదటి విడుత విడుదల చేసిన నిధులు మండలాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
మండలాల వారీగా నిధుల వివరాలు..
ములుగు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు మొదటి విడుత స్కూల్ గ్రాంట్ విధుల కింద రూ. 17,33,977 నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఏటూరునాగారం మండలంలో 28పాఠశాలలకు రూ. 1,84,9 99, గోవిందరావుపేటలోని 29పాఠశాలలకు రూ.1,46,664, కన్నాయిగూడెం మండలంలోని 17 పాఠశాలల కు రూ.1,08,333, మంగపేట మండలంలోని 41 పాఠశాలలకు రూ.2,21,663, ములుగు మండలంలోని 61 పాఠశాలలకు రూ.2,94,995, తాడ్వాయి మండలంలోని 33 పాఠశాలలకు రూ.1,63, 331, వెంకటాపూర్ మండలంలోని 34 పాఠశాలలకు రూ.1,64,997, వెంకటాపురం(నూగూరు) మండలంలోని 45 పాఠశాలలకు రూ.2,48,997, వాజేడు మండలంలోని 40 పాఠశాలకు రూ.1,99,998లను ప్రభుత్వం మం జూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles