హరితహారం లక్ష్యం నెరవేరాలి

Fri,July 12, 2019 02:50 AM

ఏటూరునాగారం: మండలంలో లక్ష్యం నెరవేరే దిశగా హరితహారం మొక్కలు నాటాలని ఇందుకు అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం హరితహారంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీపీ, ఎంపీటీసీలు, పంచాయితీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని, ప్రతీ మొక్కను పెంచే బాధ్యత ఇంటి యాజమానులకు అప్పగించాలన్నారు. చెరువు కట్టలపై ఖర్జూర, ఈత మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. నాటిన మొక్కలు రక్షించుకునే విధంగా చేయాలన్నారు. మొక్కలు నాటే విధానంపై అందరికి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. సమావేశంలో ఎంపీపీ అంతటి విజయ, ఈజీఎస్ ఏపీవో చంద్రకాంత్, ఈవోపీఆర్‌డీ శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, ఎంపీటీసీలు పర్వతాల భరత్, కోట నర్సింహులు, అల్లి సుమలత, మల్లెల ధనలక్ష్మీ, గుడ్ల శ్రీలత, జాడి లక్ష్మీనారాయణ, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్తులకు మొక్కల పంపిణీ
ములుగురూరల్: ములుగు జిల్లా పరిధిలోని పొట్లాపురం గ్రామంలో సర్పంచ్ కుమ్మిత లతఅంకిరెడ్డి శుక్రవారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారంలో భాగంగా ప్రజలు నాటేందుకు అవసరమైన మొక్కలను నర్సరీ వద్ద ఏఈవో జ్యోతితో కలిసి సర్పంచ్ అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఈసం పాపయ్య, కార్యదర్శి రవిచంద్ర, ప్రజలు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
వాజేడు: హరితహారంలో భాగంగా మండలంలోని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, 10లక్షల మొక్కల టార్గెట్‌ను అధిగమించాలని జెడ్పీటీసీ తల్లడి పుష్పలత, ఎంపీపీ గొంది స్వరూప, శ్యామల శారద పిలుపు నిచ్చారు. మండలంలోని మొరుమురు గ్రామపంచాయతీలోని ప్రగళ్లపల్లి గ్రామంలో గురువారం హరితహారం ప్రారంభ కార్యక్రమ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. హరితహారం ర్యాలీని ఎంపీపీ గొంది స్వరూప ప్రారంభించారు. ప్రగళ్ళపల్లి పెద్ద చెరువు కట్ట వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. కా ర్యక్రమంలో ఎఫ్‌ఆర్వో డోలీ శంకర్, ఎంపీడీవో చంద్రశేఖర్, వ్యవసాయాధికారి వాజీద్ మహ్మద్, ఎఫ్‌ఆర్వోలు శంకర్, విజయలక్ష్మీ, ఇరిగేషన్ ఏఈ సుధాకర్, ఈవోపీఆర్డీ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి చిడెం నరేష్ కుమార్, సర్పంచ్ పూసం నరేష్, ఉపసర్పంచ్ గౌరారపు కోటేశ్వరరావు, హెచ్‌ఎం సూదేష్‌రావు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రత్నవతి, ఫీల్డ్ అసిస్టెంట్‌లు గాంధీ, రాంబాబు, అంగన్‌వాడీ కార్యకర్తలు దేవి, ఉషారాణి, రమాదేవి, కళావతి, గ్రామస్తులు పాల్గొన్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles