ములుగు అభివృద్ధి నా బాధ్యత

Sun,July 14, 2019 01:56 AM

- ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో మారుమూల జిల్లా అయిన ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచేందుకు తన వంతు కృషి చేస్తానని వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ జిల్లా నుంచి తనకు ఓటు వేసి ఆశీర్వదించి ప్రపంచంలోనే అత్యధిక మెజార్టీ కట్టబెట్టిన ఎంపీటీసీలు, ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వారు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని, పార్టీ సభ్యత్వం పొందిన ప్రతీ ఒక్కరి కష్టసుఖాల్లో పాలుపంచుకోనున్నారని తెలిపారు. సభ్యత్వం పొందిన వారికి కష్టం వస్తే పార్టీకి తెలిపేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సంబంధిత నంబర్‌కు మిస్ కాల్ ఇచ్చిన వెంటనే రిటన్ కాల్ చేసి సమస్యను అడిగి తెలుసుకుంటారని, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి సమస్య తలెత్తిన వ్యక్తికి పూర్తిగా అండగా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారని తెలిపారు. 30 నుంచి 35వేల క్రియాశీలక సభ్యత్వాలను పూర్తి చేస్తే సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల సమస్యలను టెలీ కాన్ఫరెన్స్ ద్వారా విని పరిష్కరిస్తారని చెప్పారు. ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల పర్యటన వివరాలను, సభలు, సమావేశాలు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరి సెల్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తారని వివరించారు. భవిష్యత్‌లో క్రియాశీల సభ్యత్వం ఉన్న వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles