సభ్యత్వ నమోదులో అలసత్వం వద్దు

Sun,July 14, 2019 01:56 AM

- రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీఆర్‌ఎస్ సభ్యత్వా న్ని పొందేందుకు ఉత్సాహంగా ముం దుకు వస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, నియోజకవర్గ సభ్య త్వ నమోదు ఇన్‌చార్జి డాక్టర్ బండా ప్రకాశ్ తెలిపారు. ములుగు నియోజకవర్గంలో ప్రజ లు టీఆర్‌ఎస్ వైపు ఉ న్నారని, కార్యకర్త లు, నాయకులు, ప్ర జాప్రతినిధులు సభ్యత్వ నమోదులో అలసత్వం వహించకుండా ప్రతీ ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆయన మా ట్లాడుతూ నమోదులో వేగాన్ని పెంచుతూ ఈ నెల 18వ తేదీ వరకు 70వేల సభ్యత్వాల టార్గెల్‌ను నమోదు చేయాలని సూచించారు. సభ్యత్వం పార్టీకి ముఖ్యమని, ఎన్నికల్లో ఓట్ల కోసం ఎలా ప్రచారం చేశామో అదే తరహాలో ఉద్యమంలా సభ్యత్వ నమోదులో పాల్గొని, రెంటింపు ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. గత సభ్యత్వానికి, ప్రస్తుత సభ్యత్వానికి తేడాను ప్రజలకు వివరించాలని సూచించారు. పదవులను ఆశించకుండా ఎన్నికల్లో పోటీ చేసి నిలబడ్డ పార్టీ టీఆర్‌ఎస్ అని, రాష్ర్టాన్ని సక్రమంగా పరిపాలిస్తూ ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం తమదే అన్నారు.

దేశంలోని 29 రాష్ర్టాల్లో నిరంతరంగా 24 గంటలు విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ప్రకటించారు. ఈ రాష్ర్టాన్ని చూసే 24గంటల కరెంట్‌ను ఇచ్చేందుకు కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అన్ని రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు బంధుపథకాన్ని అమ లు చేస్తున్నదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కార్యకర్తలకు సమయం కేటాయించే వీలు లేక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువ నాయకుడు, తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పారని పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లిన ప్రభుత్వ సంక్షేమ పథకాల మాదిరిగానే పార్టీ సైతం ప్రజల్లోకి వెళ్లేలా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదులో ముందుండాలన్నారు. ప్రభు త్వం అందించే పాలనను ప్రజలకు వివరించి సభ్యత్వం పొందేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో 3కోట్ల 60 లక్షల మందిని పార్టీలోకి తీసుకురావాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. కార్యకర్తలు వర్గాలు, విబేధాలు అం టూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పోవద్దని, స్నేహ పూర్వకంగా ఉంటూ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలన్నారు.

16
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles