కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్

Sun,July 14, 2019 01:57 AM

- 18 వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి
- ఎంపీ బండా ప్రకాశ్
- ములుగు అభివృద్ధికి కృషి
- ఎమ్మెల్సీ పోచంపల్లి

ములుగు, నమస్తే తెలంగాణ: ములుగు జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉద్యమంలా చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి డాక్టర్ బండా ప్రకాశ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్ ఫంక్షన్‌లో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అధ్యక్షతన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా బండా ప్రకాశ్, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌లు హాజరయ్యారు.

క్రమశిక్షణ తప్పితే సస్పెన్షన్
- జెడ్పీచైర్మన్ జగదీశ్వర్
టీఆర్‌ఎస్ ప్రజల సంక్షేమం కోసం పాటు పడి, వారి అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీ అని, క్రమశిక్షణకు మారు పేరు అని జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ తెలిపారు. నాయకులంతా కలిసి మెలిసి సభ్యత్వాలు చేయించాలని, ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోకుండా క్రమశిక్షణతో మెదలాలన్నారు. పార్టీ నియమ నిబంధనలు, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌ల ఆలోచనల మేరకే నాయకులు, కార్యకర్తలు నడుచుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించడంలో నాయకులు ముందుండాలని సూచించారు. టీఆర్‌ఎస్ శ్రేణులు గ్రూపుల విధానాన్ని, రెచ్చగొట్టే ధోరణిని వీడాలని, జవాబుదారీగా పని చేసే వారికి పదవులు దక్కుతాయన్నారు. మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు అంటే కార్యకర్తలకు రక్షణ కవచమని, ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయని, వారందరినీ చేరదీసి సభ్యత్వం కల్పించి పార్టీపై విధేయతతో కార్యకర్తలంతా పనిచేయాలని సూచించారు.

మాజీ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ గతంలో సభ్యత్వం తీసుకున్న వారికి, ఇతర పార్టీల వారికి, యువకులకు సభ్యత్వ నమోదులో ప్రాధన్యత ఇవ్వాలన్నారు. సమావేశానికి ముఖ్య అతిథులు హాజరైన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలను ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్ దంపతులు ఘనంగా సన్మానించారు. వారికి పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించారు. సమావేశంలో సభ్యత్వ నమోదు డిజిటలైజనేషన్ ఇన్‌చార్జి, టీఆర్‌ఎస్ రాష్ట్ర యూత్ సెక్రటరీ ఏరువ సతీష్‌రెడ్డి, రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్‌యాదవ్, జెడ్పీటీసీలు సకినాల భవాని, గై రుద్రమదేవి, తుమ్మల హరిబాబు, గోవిందరావుపేట ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ మెంబర్లు వలియాబీ, రియాజ్‌మిర్జా, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, కేశవరావు, పోరిక గోవింద్‌నాయక్, గుండాల మధన్‌కుమార్, కాక లింగయ్య, మల్క రమేశ్, పిండి రవియాదవ్, జంగలి రవితేజ, ఎంపీటీసీలు మాచర్ల ప్ర భాకర్, మహేశ్, పోరిక విజయ్‌రామ్‌నాయక్, సర్పంచులు, టీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles