పల్లెలు పచ్చదనంతో కళకళలాడాలి

Mon,July 15, 2019 01:25 AM

-అదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
-మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌
గోవిందరావుపేట: తెలంగాణను హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రతీ పల్లె పచ్చదనంతో కళకళలాడాలనేదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ అన్నారు. మండలంలోని బాలాజీనగర్‌, లక్ష్మీపురం గ్రామాలలో ఆదివారం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో చందూలాల్‌ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములతోపాటు ప్రతీ ఇంటా పండ్లు, పూల మొక్కలు నాటి వాటిని పోషించే భాద్యత తీసుకుని గ్రామాలను హరితవనంలా తీర్చిదిద్దాలని గ్రామస్తులకు సూచించారు. ప్రస్తుతం అడవంతా పోడై కాలుష్యం ఏర్పడిందని నేటి తరాలకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆయా నర్సరీల ద్వారా పండ్ల మొక్కలతోపాటు పలు రకాల మొక్కలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని వాటిని తీసుకెళ్లి ఇళ్లలో, ఖాళీ స్థలాల్లో నాటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చందూలాల్‌ను బాలాజీనగర్‌ సర్పంచ్‌ మౌనిక-వినోద్‌ సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఇస్లావత్‌ మౌనిక, లావుడ్యా స్వాతి, రైతు సమన్వయసమితి జిల్లా కన్వీనర్‌ పండ్ల బుచ్చయ్య, నాయకులు కుటుంబరావు, పాల్తియా రూప్‌సింగ్‌, లకావత్‌ శ్రవణ్‌నాయక్‌, లావుడ్యా గణేష్‌లాల్‌, జర్పుల ప్రతాప్‌, పాడియా హర్జీ, అజ్మీరా సురేందర్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

19
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles