సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

Wed,July 17, 2019 04:13 AM

ములుగు, నమస్తేతెలంగాణ: సివిల్ సైప్లె హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి కి వినతిపత్రం అందించారు. తొలుత జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ హమాలీలు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో 14 రకాల వస్తువులను రవాణా చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న హమాలీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు జంపాల రవీందర్, వెంకటేష్, ఇంజం కొమురయ్య, ముత్యాల రాజు, హమాలీలు మొలుగూరి రాంబాబు, కొమురయ్య, భిక్షపతి, రఘు, రాజు, రమేశ్, సదయ్య, నరేశ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles