సాయిబాబా ఆలయంలో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర దంపతులు

Wed,July 17, 2019 04:14 AM

కృష్ణకాలనీ, జూలై 16 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో ఆ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి మహోత్సవ వే డుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గం డ్ర జ్యోతి దంపతులు షిరిడీసాయిబాబా ఆలయంలో ధ్యాన మందిరమును ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గురు పౌర్ణమి చాలా పవిత్రమైన దినమన్నారు. సమాజంలో గురువును మించిన దైవం లేరన్నారు.

తల్లి దండ్రులు మనకు జన్మనిస్తే.. ప్రపంచాన్ని శాసించే విజ్ఞాన్నిచ్చేవారు గురువులు అని అన్నారు. కనపడని దేవుళ్లు ఎంతో మంది ఉన్నారు కానీ మనకు కనిపించే దేవుడు మాత్ర గురువు మాత్రమేనని అన్నారు. నాడు రాముడు మంచి వాడు అని పేరుగాంచడానికి అతని గురువు విశ్వామిత్రుడి పాత్ర చాలా ప్రధానమైనదిగా చెప్పారు. ప్రతి ఏటా గురు పౌర్ణమి నాడు గురువును యావత్ ప్రపంచ జనాభా స్మరించుకోవడం మానవుని అదృష్టమన్నారు. మనకు విజ్ఞానాన్ని ప్రసాదించిన గురువు ప్రతి రూపమే గురు పౌర్ణమి అని అన్నారు.

పోటెత్తిన భక్తులు..
జిల్లా కేంద్రంలోని భక్తులు తమ కుటుంబాలతో సాయిబాబాను దర్శించుకోవడానికి రావడంతో ఆలయం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. కారల్ మా ర్క్స్ కాలనీ అంతా షిరిడి సాయి నామ స్మరణతో మార్మోగింది. మంగళవారం ఉదయం 5గం టలకు ప్రభాతసేవ-కాకడహారతితో పూజ కార్యక్రమాలు ప్రారంభం కావడంతో భక్తు లు ఉదయం నుంచే ఆలయానికి పోటెత్తారు. ఈ సందర్భం గా భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి సాయినాథుడిని ద ర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం షిరిడీ సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాఅన్నధాన కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీవో వెంకటాచారి ప్రత్యక్షంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వడ్డించారు. 9వార్డు కౌ న్సిలర్ శిరుప అనిల్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles