శిశుగృహకు అప్పగింత

Wed,July 17, 2019 04:15 AM

ములుగురూరల్, జూలై 16 : చిన్న వయస్సులోనే తల్లి మృతితో ఆలనాపాలనకు దూరమైన 11నెలల బాలుడిని ములుగు జిల్లా ముస్కాన్ టీం బృందం చేరదీసింది. ములుగు జిల్లా అ బ్బాపురం గ్రామపంచాయతీ పరిధి శ్రీరాములపల్లికి చెందిన ర్యాకల లయ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. ఆమె మృతి చెందిన తండ్రి కృష్ణ పట్టించుకోకపోవడం తో గ్రామస్తులే ఆ బాలుడి ఆలనాపాలనా చేసే వారు. బాలుడిని సంరక్షణ నిమిత్తం ఆ గ్రామస్తులు ముస్కాన్ టీంకు సమాచారం అందించ గా మంగళవారం సీఐడీ డీఎస్పీ రవికుమార్, డీ సీపీవో ఓంకార్‌లు గ్రామానికి చేరుకొని పూర్తి వి వరాలు తెలుసుకున్నారు. తల్లి మృతితో బాలు డు పడుతున్న కష్టాలను వివరించారు. సొంత ఇల్లు లేకపోవడంతో తండ్రితోపాటు గ్రామపంచాయతీ, పాఠశాల భవన ప్రాంగణంలో రాత్రివేళల్లో నిద్రించే వాడని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో బాలుడికి విషపు పురుగులు కుట్టి ఒళ్లంతా దద్దుర్లు రావడాన్ని గమనించారు. గ్రామ పెద్దలు, సర్పంచ్, అంగన్‌వాడీ టీచర్‌తో డీఎస్పీ, డీసీపీవోలు చర్చించి బాలుడి తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలుడిని సంరక్షించే బా ధ్యతను వివరించి ఆ బాలుడిని సంరక్షణ నిమి త్తం వరంగల్‌లోని శిశుగృహానికి తరలించి అక్క డి అధికారులకు అప్పగించారు. ఈ సందర్భం గా డీఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన బా ల్యం ఎంతో ముఖ్యమని, బాలల హక్కులను ఎ వరూ కాలరాయవద్దని సూచించారు. బాల్యం లో మగ్గుతూ ఎలాంటి ఆలనాపాలనకు నోచుకోని పిల్లలు, బాల కార్మికులుగా ఉన్న వారు తా రస పడితే ప్రజలు తమకు సమాచారం అం దించి సహకరించాలని కోరారు. కాగా, బాలుడిని సంరక్షించిన ముస్కాన్ టీంకు పలువురు అభినందనలు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వీ లక్ష్మి, సర్పంచ్ కుమారస్వామి, అసిస్టెం ట్ లేబర్ ఆఫీసర్ షర్పొద్దీన్, డీసీపీయూ సోషల్ వర్కర్ బీ జ్యోతి, అంగన్‌వాడీ టీచర్ భాగ్య, ఆపరేషన్ ముస్కాన్ టీం కానిస్టేబుల్, సీఐడీ కానిస్టేబుల్, చైల్డ్‌లైన్ ఎస్ గోదాదేవి ఉన్నారు.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles