క్షేత్రస్థాయి సిబ్బందితోనే అడవుల సంరక్షణ

Tue,August 20, 2019 02:55 AM

కాటారం, ఆగస్టు19: క్షేత్రస్థాయి సిబ్బందితోనే అడవుల సంరక్షణ సాధ్యమని భూపాలపల్లి డీఎఫ్‌వో ప్రదీప్‌శెట్టి తెలిపారు. మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో అటవీశాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా (నార్త్ డివిజన్) పరిధిలో ఇటీవల బీట్ ఆఫీసర్లుగా ఎంపికైన వారికి ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని ప్రదీప్‌శెట్టి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా నియామకమైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. వారం రోజుల పాటు జరిగే శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని అటవీ చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిక్షణలో భాగంగా బీట్ ఆఫీసర్లకు వన నర్సరీల ఏర్పాటు, అడవుల సంరక్షణ, ప్లాంటేషన్ల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో మహదేవపూర్ ఎఫ్‌డీవో వజ్రారెడ్డి, కాటారం, చెల్పూర్, పెగడపల్లి ఎఫ్‌ఆర్వోలు జగన్‌మోహన్, పూర్ణిమ, ముషీర్ అహ్మద్, డీఆర్వో మధుబాబు, ఎఫ్‌ఎస్‌వోలు, ఎఫ్‌బీవోలు పాల్గొన్నారు.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles