లక్ష్మీ బరాజ్‌లో 20 గేట్ల ఎత్తివేత

Tue,August 20, 2019 02:56 AM

మహదేవపూర్, ఆగస్టు 19: లక్ష్మీ(మేడిగడ్డ)బరాజ్‌లో సోమవారం 20 గేట్లను ఎత్తినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని కురుస్తున్న వర్షాలతో తగ్గుతూ పెరుగుతూ వస్తున్న వరద ప్రవాహంతో లక్ష్మీ బరాజ్‌లో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా 33 గేట్లను ఎత్తి ఉంచిన అధికారులు సోమవారం నీటి ప్రవాహం తగ్గడంతో 13 గేట్లను మూసేసి 20 గే ట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నట్లు వెల్లడించారు. సోమవారం 20 గేట్ల నుంచి 1.11 ల క్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్లు వివరించారు. లక్ష్మీ బ రాజ్‌లో శనివారం నీటి మట్టానికి 95.300 మీటర్ల ఎత్తులో 5.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరస్వతి(అన్నారం) బరాజ్‌లో 2 గే ట్లను ఎత్తి ఉంచారు. ఇక్కడ 7వేల క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో, 4.531 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నదని, బరాజ్‌లో సోమవారం 7.29 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని అధికారులు చెప్పారు.

15
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles