పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

Tue,August 20, 2019 02:57 AM

-విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌పై బదిలీ వేటు
కాటారం, ఆగస్టు 19 : ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుధార్‌సింగ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీ పరిసరాలను పరిశీలించి రోగులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అటెండెన్స్ రిజిష్టర్‌లో సంతకం చేసి ఆస్పత్రిలో వైద్యుడు ప్రమోద్‌కుమార్ లేకపోవడంతో ఆరాతీశారు. అయితే ప్రమోద్‌కుమార్ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కనిపించడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ వేటు వేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. ప్రమోద్‌కుమార్‌ను వెలిశాల పీహెచ్‌సీకి బదిలీ చేశామన్నారు. వెలిశాల పీహెచ్‌సీలో పని చేస్తున్న డాక్టర్ స్రవంతిని విధుల్లో నిర్లక్ష్యం కారణంగా కాటారం పీహెచ్‌సీకి బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన గంగారం ఏఎన్‌ఎం మనోరమను కరీంనగర్ డీఎంహెచ్‌వో కార్యాలయానికి సరెండర్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ యాదగిరి ఉన్నారు.

18
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles