హరితహారాన్ని విజయవంతంగా పూర్తి చేయాలి

Wed,August 21, 2019 03:57 AM

-జియోట్యాగింగ్ తప్పని సరి
-శ్మశాన వాటికలు, డంప్‌యార్డులు ఏర్పాటు చేయాలి
-ఇన్‌చార్జి డీఆర్‌డీవో వసంతరావు
ఏటూరునాగారం, ఆగస్టు 20 : హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి డీఆర్‌డీవో వసంతరావు కోరారు. ఐటీడీఏ కార్యాలయంలో జిల్లాలోని తొమ్మిది మండలాలకు చెందిన ఈజీఎస్ ఏపీవోలతో మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఆర్‌డీవో ద్వారా 56 లక్షల మొ క్కల పెంపకం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 33లక్షల మొక్కలను నాటుపెట్టామన్నారు. వంద మొక్కలకు పైగా పెంచుకునే వారికి రెండు సంవత్సరాల పాటు నిర్వహణ కింద మొక్కకు రూ. 5చొప్పున చెల్లించామని పేర్కొన్నారు. రూ. 90 కోట్ల వరకు నిధులకు పరిపాలన మంజూరు లభించినట్లుగా ఆయన తెలిపారు. మిగతా మొక్కలను పూర్తి అయ్యే విధంగా ఆగస్టు చివరిలోగా నాటు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొక్కలకు కచ్చితంగా జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుందని, దీనిపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. జిల్లాలో 131 శ్మశాన వాటికలు మంజూరు కాగా ఇందులో 65 వరకు పురోగతిలో ఉన్నాయని, మిగతావి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో శ్మశాన వాటికకు ప్రభుత్వం రూ. 10లక్షలు కేటాయించిందని ఆయన వివరించారు. జిల్లాలో 13 1 డంపింగ్‌యార్డులు మంజూరు చేయగా ఇందులో 45 వరకు పురోగతిలోఉన్నట్లు ఆయన వివరించారు. గ్రామా ల్లో డంపింగ్ యార్డుకోసం స్థలాలను కేటాయించాలని సూచించారు. ఇంకుడు గుంతలు, పర్కులేషన్ ట్యాం కుల నిర్మాణాలు చేపట్టాలని వసంతరావు కోరారు. సమావేశంలో ఈజీఎస్ ఏపీడీ వెంకటనారాయణ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏపీవోలు, తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles