పౌష్టికాహారంపై అవగాహన కలిగించాలి

Wed,August 21, 2019 03:58 AM

కలెక్టరేట్, ఆగస్టు 20 : పౌష్టికాహారం తీసుకోవడంపై ప్రజల్లో అవగాహన పెం పొందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కూ రాకుల స్వర్ణలత అధికారులను ఆదేశించా రు. మంగశవారం కలెక్టర్ కార్యాలయంలో ని జేసీ చాంబర్‌లో పోషక అభియాన్ ప్రో గ్రాంలో భాగంగా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం రక్తహీనత, పోషకాహారలోపం, కురుచదనం, తక్కువబరువు ఉన్న పిల్లలు, గర్భిణులు, బాలింత లు, కిశోర బాలికలలో పోషణ స్థాయిని పెంచడానికి జిల్లా స్థాయి సంబంధిత శాఖ ల అధికారులను భాగస్వాములుగా చేస్తూ పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడ డం. కాగా, సమావేశంలో జేసీ స్వర్ణలత మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు అంది ప్రజలు ఆరోగ్యంగా ఉండి మానసికంగా కూడా చురుకుగా ఉంటారని అన్నా రు. సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే శరీరానికి పోషకాలు అందక రక్తహీనత కలిగి వ్యాధి నిరోధక శక్తి తగ్గి త్వరగా ప్రజలు అనారోగ్యానికి గురియ్యే అవకాశం ఉందన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం వలన కలిగే లాభాలను జిల్లా ప్రజలకు తెలియజేసి ప్రతి ఒక్కరు పౌష్టికాహారంను తీసుకునేలా అధికారులు చూడాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా రెగ్యులర్‌గా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, దవాఖానలలో కూడా పౌష్టికాహారం విలువలను రోగులకు తెలుపాలని అన్నారు. పౌష్టికాహారంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి పాఠశాల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలని, ఇందులో అంగన్‌వాడీ టీచర్లు, వైద్యులు, వైద్యసిబ్బంది పాల్గొనాలని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో చర్చించాలని ఆమె తెలిపారు. జిల్లా, మండల, గ్రామస్థాయిలలో పౌష్టికాహార కమిటీలు వేసి విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుధార్‌సింగ్, పోషక అభియాన్ ప్రాజెక్ట్ అధికారి చల్లూరి సరిత, జెడ్పీసీఈవో శిరీష, డీఆర్డీఏ పీడీ సుమతి, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి డీఎస్‌డబ్ల్యూవో సునీత తదితరులు పాల్గొన్నారు.

20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles