వాగులు దాటి వైద్య సేవలు

Wed,August 21, 2019 03:58 AM

-ఉధృతంగా బంధాల వాగు
-దాటుకుంటూ వచ్చిన డీఎంహెచ్‌వో అప్పయ్య
తాడ్వాయి, ఆగస్టు 20 : గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు వైద్యసేవలు అందించేందుకు వైద్య సిబ్బంది సాహసాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామాల సమీపంలో ఉండే వాగులు, వంకలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామస్తులు సమీప ప్రభుత్వ దవాఖానలకు వెళ్లి వైద్యసేవలు పొందే అవకాశం లేదు. దీంతో వైద్య సిబ్బందే మారుమూల గ్రామాలకు వెళ్లి వైద్యసేవలు అందించాలని నిశ్చయించుకున్నారు. భారీ వర్షం కురుస్తుందని, తిరుగు ప్రయాణంలో వాగు దాటలేమని తెలిసి కూడా ప్రజలకు వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్య, కొడిశాల వైద్యాధికారి అవినాశ్‌లు మంగళవారం వైద్యశిబిరాలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో మండలంలోని పోసాపురం మినీ గురుకులం పాఠశాలలో హాస్టల్ నిద్ర చేశారు. మంగళవారం ఉదయం బంధాల గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించేందుకు బయలుదేరారు. వెళుతున్న క్రమంలో భారీ వర్షం కురుస్తుండటంతో అలాగే గ్రామానికి వెళ్లారు. అక్కడ వైద్యశిబిరం నిర్వహించారు. పలు రకాల రుగ్మతలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తిరుగుప్రయాణంలో బంధాల గ్రామ సమీపంలోని వాగు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తుండగా అక్కడే గంటల తరబడి వరద తగ్గుతుందని వేచి చూశారు. ప్రవాహం కాస్త తగ్గడంతో స్థానికుల సహాయంతో డీఎంహెచ్‌వో అప్పయ్య, కొడిశాల వైధ్యాధికారి అవినాశ్, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఒడ్డుకు చేరుకున్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles