ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

Wed,August 21, 2019 03:58 AM

-ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు
- మంగపేటలో పర్యటన
మంగపేట, ఆగస్టు 20 : వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఐ టీడీఏ పీవో చక్రధర్‌రావు ఆదేశించారు. మం గపేట మండలంలో మంగళవారం సాయం త్రం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆశ్రమ పాఠశాలలు, ఆసుపత్రులను తనిఖీలు చేసి, ఉద్యోగులు, సిబ్బందికి తగిన సూచనలు అందించారు. ముందుగా బ్రాహ్మణపల్లి, చుంచుపల్లి ఆశ్రమ పాఠశాలలను సం దర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సంబంధించి బయోమెట్రిక్ ఆన్‌లైన్ హా జరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. వి ద్యార్థులకు తయారు చేసిన భోజనాన్ని రుచి చూశారు. అందుతున్న మె నూపై విద్యార్థుల ను అడిగి తెలుసుకున్నారు. కంప్యూట ర్ తరగతుల విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులు ప్ర ణాళిక ప్రకారం చదివి మంచి ఫలితాలు సాధించాలని సూ చించారు. హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణ లో మొక్కలు నా టారు. అ నంతరం చుంచుపల్లి పీహెచ్‌సీని సందర్శించి, దవాఖానలోని వివిధ రికార్డులను పరిశీలించారు. మందుల నిల్వ వివరా లు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల వల్ల గ్రామీణులు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు సబ్‌సెంటర్ల వారీగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేయాలన్నారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలుంటాయని పీవో ఆశ్రమ పాఠశాల, ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరించారు. పీవో వెంట ఏటీడీవో క్షేత్రయ్య ఉన్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles