ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

Wed,August 21, 2019 03:59 AM

-రానున్న రోజుల్లో హెల్త్ ప్రొఫైల్
-జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్
-మహిళలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి
-త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవానాథ జీయర్‌స్వామి
-మహిళా ఆరోగ్య వికాస్ వైద్య శిబిరం
ములుగు, నమస్తేతెలంగాణ: ఆడబిడ్డల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పనిచేయనున్నట్లు టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. మంగళవారం తన జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు గృహంలో విడిది చేసిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవానాథ జీయర్‌స్వామిని ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్, స్థానిక నాయకులతో కలిశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్ర మహి ళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వికాసతరంగిణి సంయుక్తంగా నిర్వహించిన మహిళా ఆరోగ్య వికాస్ వైద్య శిబిరాన్ని జెడ్పీ చైర్మన్ స్వామివారితో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే గ్రామాలు, పట్టణాలు పటిష్టంగా ఉంటాయని, గ్రామాలు, పట్టణాలు పటిష్టంగా ఉంటే రాష్ట్రం పటిష్టంగా ఉంటుందని వివరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ఇందులో భాగంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజల సమగ్ర ఆరోగ్య పరీక్షలను నిర్వహించేందుకు హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సైతం చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహకారాలు అందిస్తున్న జీయర్ స్వాముల వారికి, వికాస తరంగణి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మహిళలు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి
మహిళలు వ్యక్తి గత పరిశుభ్రత పాటిస్తూ ప్రతీ సంవత్సరం తప్పని సరిగా రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవానాథ జీయర్‌స్వామి అన్నారు. 1994లో ఏర్పాటు చేసిన వికాస తరంగిణి ద్వా రా ఇప్పటికే ఎన్నో ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఇటీవల తనను కలిసి హైదరాబాద్‌లో కలిసి ములుగు జిల్లాలో వైద్య శిబిరాన్ని నిర్వహించాలని కోరారన్నారు. అందుకే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక నుంచి జిల్లాలో ప్రతీ రెండు నెలలకు ఒకసారి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు స్వామి వారు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో పారిజాతం, జెడ్పీటీసీ సకినాల భవాని, సీడీపీవో దేవరశెట్టి లక్ష్మి, ఎంపీడీవో రవి, వికాస తరంగిణి వరంగల్ జోన్ చైర్మన్ ప్రొఫెసర్ పాకనాటి జ్యోతిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles