మేడారంలో ఘనంగా పొట్ట పండుగ

Thu,August 22, 2019 02:49 AM

-వనదేవతలకు పూజారుల ప్రత్యేక పూజలు
తాడ్వాయి, ఆగస్టు 21 : మండలంలోని మేడారం లో బుధవారం సమ్మక్క-సారక్కల పూజారులు, ఆదివాసీ గిరిజనులు పొట్ట పండుగను ఘనంగా నిర్వహించారు. డోలివాయిద్యాల నడుమ సమ్మక్క దేవత మందిరానికి చేరుకొన్నారు. పూజారులు మునిందర్, జగ్గారావు, క్రిష్ణయ్య, లక్ష్మణ్‌రావు, నర్సింగరావులు గుడిని శుద్ధి చేసి గద్దెను అలంకరించారు. అనంతరం గిరిజనులు పండించిన మొదటి ధాన్యాలను సమర్పించి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి డోలి వాయిద్యాల నడుమ గ్రామదేవతల మందిరాల వద్దకు చేరుకొని పూజలు చేశారు. అనంతరం వనభోజనాలకు తరలిన గిరిజనులు తిరిగి రాత్రి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రంతా అమ్మవార్ల గద్దెల వద్ద జాగారాలు చేశారు. ఇప్పటి నుంచి పూజారుల కుటుంబాలు తమ పంటపొలాల్లో పండించిన ధాన్యం, కూరగాయలను భుజిస్తారు.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles