ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే గండ్ర

Thu,August 22, 2019 02:50 AM

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 21 : భూపాలపల్లి ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బు ధవారం భూపాలపల్లిలోని ఆర్టీసీ డిపో లో నూతన సూపర్ లగ్జరీ బస్సును ఆ యన ప్రారంభించారు. అనంతరం బ స్సును బస్టాండ్ వరకు తానే నడుపుకుం టూ వచ్చి బస్టాండ్‌లో నిలిపివేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ బస్టాండ్ ప్రాంగణం లో సీసీ రోడ్డు నిర్మాణం జరుపుతామని, ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాడి నిధు లు కేటాయింపునకు కృషి చేస్తానని అ న్నారు. భూపాలపల్లి డిపోకు మరో 40 బస్సులు రావాల్సి ఉందని, ఈ విషయ మై అధికారులతో మాట్లాడుతానని అ న్నారు. కాళేశ్వరానికి పర్యాటకులు, భక్తు ల తాకిడి పెరిగిన క్రమంలో భూపాలపల్లి డిపోలో బస్సుల సంఖ్య పెరుగాలని అన్నారు. అలాగే, భూపాలపల్లి డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు సైతం మంజూరు చేయించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని డిపో మేనేజర్ లక్ష్మీధర్మ, అధికారులు, యూనియన్ నేతలు బుర్రి తిరుపతి, కోటి తదితరులు సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అర్బన్ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, మహిళా ఆర్గనైజర్ భారతిరెడ్డి, నేతలు మేకల సంపత్‌యాదవ్, బుర్ర రమేశ్, బండారి రవి, చల్లూరి సమ్మయ్య, గండ్ర హరీశ్‌రెడ్డి, కొత్త హరిబాబు, బీబీ చారి, ఆకుల మల్లేశ్, కటకం జనార్దన్, మేనం తిరుపతి, నాగపురి సమ్మయ్యగౌడ్, వజ్రమణి, పూలమ్మ, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles