ఆర్థిక నేరాలకు పాల్పడితే చర్యలు

Thu,August 22, 2019 02:50 AM

ములుగు, నమస్తేతెలంగాణ : ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం వ్యక్తిగత రుణాలను ఇప్పిస్తామని కొంత మంది వ్యక్తులు జాతీయ రహదారి పక్కన టెంటు వేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుండగా ములుగు పోలీసులు సంబంధిత వ్యక్తులను హెచ్చరించారు. స్తానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ బ్యాంకులలో కమీషన్‌ల పద్ధతిన రుణాలను అందిస్తామని చెప్పి పాన్‌కార్డులు, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలను తీసుకొని ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తుండగా కొంత మంది యువకులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. స్పందించిన ములుగు పోలీసులు అక్కడికి చేరుకొని సంబంధిత వ్యక్తులను ఏ ఆధారాలతో రుణాలు ఇప్పించేందుకు యత్నిస్తున్నారని, ఇది చట్ట వ్యతిరేకమని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించి వదిలేసినట్లు తెలిసింది

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles