చోరీకి పాల్పడిన నిందితుడికి రిమాండ్

Thu,August 22, 2019 02:51 AM

కాటారం, ఆగస్టు 21 : మండలకేంద్రమైన గారెపల్లి అభయాంజనేయ స్వామి ఆలయంలో హూండీని పగులగొట్టి చోరికి పాల్పడిన నిందితుడిని బుధవారం రిమాండ్ చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. భూపాలపల్లి గాంధీనగర్‌కు చెందిన రవి అనే సింగరేణి కార్మికుడు తాగుడుకు అలవాటు పడి డబ్బుల కోసం ఆలయంలో హుండీని పగులగొట్టి చోరికి పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు. సోమవారం రాత్రి ఆలయంలో చోరీ జరుగగా బుధవారం మండలకేంద్రంలోని బస్టాప్‌లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా తన కోసమే పోలీసులు వస్తున్నారని భావించి రవి బస్సు దిగి పారిపోతుండగా పట్టుకొని విచారించగా తానే ఆలయంలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడన్నారు. నిందితుడి నుంచి రూ. 14,400 రికవరీ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles