కాళేశ్వరం వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి

Fri,August 23, 2019 04:03 AM

-స్నేహ సంబంధాలకు ప్రాధాన్యం విదేశీ వ్యవహారాల ప్రతినిధి అనిల్ త్రిగుణాయత్
నిట్‌క్యాంపస్, ఆగస్టు 22 : విదేశాలతో విలువైన స్నేహసంబంధాలు నెలకొల్పడానికే మనదేశం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భారత, విదేశీ వ్యవహారాల ప్రతినిధి అనిల్ త్రిగుణాయత్ అన్నారు. ఆర్థిక, రక్షణ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీతో అన్ని దేశాలతో సఖ్యతగా ఉండటానికి కృషి చేస్తున్నామని చెప్పారు. గురువారం నిట్‌లో నిర్వహించిన ప్రముఖలు ప్రసంగాలు కార్యక్రమంలో భాగంగా విదేశీ సం బంధాల్లో మార్పులు, సవాళ్ళు అనే అంశంపై తన అనుభవాలను, భారతదేశపు ఆలోచనలను పంచుకున్నారు. బంగ్లాదేశ్, మంగోలియా, అమెరికా, రష్యా, స్వీడన్ వంటి దేశాల్లో పనిచేసి పలు ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో భారత ప్రతినిధిగా అనిల్ త్రిగుణాయత్ అనేక కార్యకలాపాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్క్ దేశాల సమావేశాలను భారత్‌లో నిర్వహించినపుడు పాక్‌తో ఉన్న నదీ జలాల వివాదాన్ని, అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేశామని తెలిపారు.

ఉగ్రవాదంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోం దని, విపత్తులు సంభవించినపుడు పొరుగు దేశాలకు సాయం అందించడం, బూటాన్ వంటి చిన్న దేశాలకు ఆర్థిక సాయం అందించడం, ప్రపంచ దేశాల వేదికలపై మన అవసరాలను, లక్ష్యాలను వివరిస్తున్నామని తెలిపారు. విదేశీ వ్యవహారాల డీ కేవీ జయకుమార్ మాట్లాడుతూ గత మార్చిలో ప్రముఖుల ప్రసంగాల్లో భాగంగా విదేశీ వ్యవహారాల ప్రతినిధి వీపీ హరేన్ మొదటి ప్రసంగాన్ని నిర్వహించామని తెలిపారు. ఇప్పుడు రెండో ప్రసంగాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డైరెక్టర్‌ఎన్వీ రమణారావు, రిజిస్ట్రార్ గోవర్ధన్ రావు, డీన్ ఎవల్‌ఆర్‌జీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles