గ్రామాల్లో ముమ్మరంగా హరితహారం

Sat,August 24, 2019 02:49 AM

ములుగురూరల్: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పిలుపు మేరకు మొక్కలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతీ విద్యార్థి విధిగా ఐదు మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతలను చేపట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థులు మొక్కల ప్రాముఖ్యను తెలియజేసేందుకు జాతీయ రహదారిపై మొక్కలను చేతపట్టుకొని పలు నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు నవీన్, మాధవి, రమేష్, ప్రసాద్, ఉమా, మల్లయ్య, రాజన్న, శాంతవతి, సరిత, శ్రీదేవి, దీప్తి, వెంకటేష్ పాల్గొన్నారు.

చిన్నబోయినపల్లి గ్రామంలో..
ఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయినపల్లి అశ్రమ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులతో పలు రకాల మొక్కలు నాటించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సారంగపాణి తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ అధికారుల ఆదేశాను సారం పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చేల లక్ష్మి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు తుమ్మ సంజీవరెడ్డి, ఉపాధ్యాయులు రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
అయ్యవారిపేట గ్రామంలో..
వాజేడు: మండలంలోని పేరూరు పోలీసుస్టేషన్ పరిధిలోని అయ్యవారిపేట గ్రామం లో ఉన్న డబుల్‌బెడ్‌రూం గృహాల సమీపంలో శుక్రవారం ఎస్సై రాందేని స్వామి సీఆర్పీఎఫ్ పోలీసులు కలసి హరితహారం మొక్కలను నాటారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles