స్థలం ఇవ్వడానికి సిద్ధం

Sat,August 24, 2019 02:50 AM

-కాజీపేట వ్యాగన్ పీవోహెచ్ షెడ్‌కు భూమి కేటాయింపు
-స్థలం స్వాధీనం కోసం జీఎంకు లేఖ రాసిన సర్కార్
- మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం
- సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు పీవోహెచ్‌పై నివేదించిన ఎమ్మెల్యే దాస్యం

కాజీపేట, ఆగస్టు 23: కాజీపేట రైల్వే జంక్షన్‌కు మంజూరైన రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ నిర్మాణానికి కావాల్సినంత స్థలాన్ని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభు త్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ (ఐఏఎస్) స్వయంగా దక్షిణ మధ్య రైల్వే జీ ఎం (జనరల్ మేనేజర్) గగణన్ మాల్యాకు శుక్రవారం లేఖను సమర్పించారు. కాజీపేట రైల్వే జంక్షన్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ అప్పటి వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి నేతృత్వంలో టీఆర్‌ఎస్ ఎంపీల బృం దం 13 ముఖ్య రైల్వే సమస్యలతో ప్రధాని నరేంద్రమోడీని కలిసి వినతి పత్రం అందజేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలంతా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో 2016-17 కేంద్ర రైల్వే బడ్జెట్‌లో కాజీపేట రైల్వే జంక్షన్‌కు 160 ఎకరాల స్థలంలో వ్యాగన్ ఐవోహెచ్ ఏర్పాటు కోసం రూ. 169 కో ట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అప్పటికే 201011లో యూపీఏ సర్కార్ కాజీపేటకు మంజూరు చేసిన వ్యా గన్ షెడ్ యూనిట్ కోసం 55 ఎకరాలు భూమి కావాల్సి ఉండగా అప్పటి ఆంధ్ర పాలకులు మడికొండ శివారులోని శ్రీ సీతారామచంద్రస్వామికి చెందిన మన్యం భూమిని ఇచ్చేందుకు సిద్ధమై రూ.18 కోట్లను విడుదల చేశారు.
దేవాలయ భూమిని నేరుగా తీసుకునే వీలులేక అప్పటి ప్రభు త్వం కోర్టును ఆశ్రయించింది. సమైక్యాంధ్ర సర్కార్ పట్టింపులేని తనంతో ఆ కేసు దాదాపు ఆరేళ్లు కోర్టులోనే ఉంది. చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించి 54 ఎకరాల 32 గుంటల భూమి ని టీఆర్‌ఎస్ సర్కార్ తీసుకుంది. మరో 106 ఎకరాల అదనపు భూమిని సేకరించి రైల్వే శాఖకు అప్పగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అప్పటి నుంచి మడికొండ గ్రామ రెవెన్యూ శివారులోని అయోధ్య పురం పరిధిలో శ్రీ సీతారా మచంద్రస్వామికి చెందిన మాన్యం భూమిని అయోధ్యపు రం రైతులను ఒప్పించి తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ భూమికోసం 42 కోట్ల రూపాయలను విడుదల చేయగా వాటిని రైతులకు నష్టపరిహారంగా అందజేశారు. రైతుల నుంచి సేకరించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రైల్వేకు అప్పగించడంలో జాప్యం జరిగింది. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ వ్యాగన్ పీవోహెచ్‌కు కావల్సిన స్థలం అప్పగింతపై సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు పలుమార్లు నివేదించారు. ఎట్టకేలకు సీఎం ఆదేశానుసారం తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గగణన్ మాల్యాకు లేఖ రాశారు. వ్యాగన్ పీవోహెచ్ షెడ్‌కు స్థలం ఇవ్వడాకి రెడీ అ ని, పనులు చేపట్టవచ్చ డని పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగా నికి కాజీపేట రైల్వే జంక్ష న్ శివారులో రైల్వే వ్యాగ న్ పీవోహెచ్ షెడ్ నిర్మాణానికి స్థలాన్ని అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles