సమష్టి కృషితోనే రాష్ట్రంలో నాలుగో స్థానం

Sat,August 24, 2019 02:53 AM

ములుగు, నమస్తేతెలంగాణ: సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలు, పార్టీ నాయకుల సమష్టి కృషితోనే 72,262 టీఆర్‌ఎస్ సభ్యత్వాలు నమోదై ములుగు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా నాల్గొ స్థానంలో నిలిచిందని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల కేంద్రాలు, గ్రామాల్లో సభ్యత్వ నమోదుకు కృషి చేసిన ఇన్‌చార్జిలు, టీఆర్‌ఎస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ములుగు నియోజకవర్గం రాష్ట్రంలో నాల్గొవ స్థానంలో నిలవడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామ న్నారు. ఇదే విధంగా పార్టీ అధిష్ఠానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా తాము సిద్ధంగా ఉన్నామంటూ పార్టీ శ్రేణులు ముందుకు వచ్చి ఇదే జోరు కొనసాగించాలన్నారు. ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జిగా తాను బాధ్యతలు చేపపట్టిన అనతికాలంలోనే శ్రేణులంతా పార్టీ కోసం కష్టపడి నియోజకవర్గాన్ని ఈ స్థాయిలో నిలిపినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దేశ చరిత్రలోనే ఏ పార్టీకి కూడా ఇన్ని సభ్యత్వాలు లేవని, ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్ అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉండడం గర్వకారణమన్నారు. కొద్ది రోజుల్లో క్రీయాశీలక సభ్యత్వం పొందిన ప్రతీ కార్యకర్తకు పార్టీ ప్రత్యేక గుర్తింపు కార్డులను అందించనున్నట్లు ఆయన తెలిపారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles