సాగునీటి సమస్యల పరిష్కారానికే వారోత్సవాలు

Sat,August 24, 2019 02:53 AM

- రైతుల సమన్వయంతో విజయవంతం చేయాలి
-విద్యుత్ వారోత్సవా మరో వారం పెంపు
-అధికారులు నూతన ఆలోచనలత ముందుకు సాగాలి
-ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి
ములుగు, నమస్తేతెలంగాణ : ములుగు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు నూతన ఆలోచనలతో ముందుకు సాగుతూ సాగు నీటి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఇరిగేషన్ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు అనుకుంటే ఎలాంటి సమస్యనైనా ప్రభుత్వ సహాయంతో పరిష్కరించవచ్చునన్నారు. ఇరిగేషన్ వారోత్సవాలను విద్యుత్ వారోత్సవాల వలే ప్రణాళిక ప్రకారం గ్రామస్తులు , ప్రజాప్రతినిధుల సహకారంతో దిగ్విజయం చేయాలన్నారు. సాగునీటి రంగంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులకు సాగు నీరు కల్పించేందుకు జిల్లాలో ఉన్న కుంటలు, చెరువులు, కాల్వలను పటిష్ట పర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు.
జిల్లా లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో నష్టం ఎక్కువగా జరగలేదని, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. ఇటీవల కురిసిన వ ర్షాలకు ఎక్కువ శాతం కాల్వలు తెగిపోయాయని, వాటికి మరమ్మతులు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. గ్రామపంచాయతీల సహకారంతో నిధులను మంజూరు చేసుకోవాల న్నారు. పక్కా ప్రణాళికతో డీఈలు, ఏఈలు సమన్వయంతో పనిచేస్తూ కనీసం రెండు, మూడు గ్రామాలకు ఒక అధికారిని నియమించి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. నిధులు లేవనే సాకుతో మరమ్మతులను పక్కన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నారు. స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకుంటూ రైతుల సహకారంతో ఇరిగేషన్ వారోత్సవాలను విజయవంతం చే యాలన్నారు. జిల్లాలో 174 గ్రామపంచాయతీలలో కనీసం 20 నుంచి 33 సమస్యలకు అవకాశం ఉంద ని తెలిపారు. ఎక్కువ నిధులు అవసరమైతే ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి 100 శాతం నిధులను మంజూ రు చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles