బెల్లం తరలిస్తున్న వాహనం పట్టివేత

Sat,August 24, 2019 02:54 AM

ములుగు, నమస్తే తెలంగాణ : గుడుంబా తయారీకి ఉపయోగించేందుకు అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని ములుగు ఎక్సైజ్ ఎస్సై భారతి తన సిబ్బందితో పట్టుకున్న సంఘటన తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంతోపాటు ములుగు మండలం మల్లంపల్లి గ్రామాల్లో చోటు శుక్రవారం చోటుచేసుకుంది. ఎక్సైజ్ ఎస్సై భారతి తెలిపిన వివరాలు ఇ లా ఉన్నాయి.. శుక్రవారం ఉదయం తెల్లవారు జా మున 3గంటలకు కాల్వపల్లిలో రూట్ వాచ్ చేస్తుండగా బెల్లాన్ని తరలిస్తున్న టాటా ఏస్ వాహనం అ నుమానాస్పందంగా కనిపించినట్లు తెలిపారు. ఈ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 200కేజీల బెల్లం ఉన్నట్లు గు ర్తించి బెల్లంతోపాటు వాహనాన్ని సీజ్ చేసి ములుగు ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఆమె వివరించారు. అదేవిధంగా మల్లంపల్లి గ్రామంలో సైతం సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా గుడుంబా తరలిస్తున్న పల్సర్ వాహనం తారస పడిందని తెలిపారు. ఈ దాడుల్లో టాటా ఏస్ వాహన డ్రైవర్‌తోపాటు పల్సర్ వాహనం నడిపే వ్యక్తి తమను గమనించి వాహనాలను వదిలి పరారైనట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, పల్సర్ వాహనంలో 5 లీటర్ల గుడుంబా లభ్యమైందని, ఈ గుడుంబాతోపాటు బైక్‌ను సీజ్ చేశామని ఆమె వివరించారు. సిబ్బంది మహేందర్, ప్రభాకర్, సలీం పాల్గొన్నారు.

2500లీటర్ల బెల్లం పానకం ధ్వంసం..
ములుగు, నమస్తే తెలంగాణ : తాడ్వాయి మం డలంలో నార్లాపురం గ్రామంతోపాటు గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం, పాపయ్యపల్లి గ్రా మాల్లో గుడుంబా స్థావరాలపై ములుగు ఎక్సైజ్ అధికారులు, జయశంకర్‌భూపాలపల్లి జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం సంయుక్త దాడులు నిర్వహించినట్లు ములుగు ఎక్సైజ్ సీఐ సుధాకర్ తెలిపారు. ఈ దాడుల్లో భాగంగా 2500లీటర్ల బె ల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు లు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. అదేవిధంగా గుడుంబా స్థావరాలను నిర్వహిస్తున్న నా ర్లాపురానికి చెందిన ధారావత్ దేవా, మొద్దులగూ డెంకు చెందిన బానోతు లలితలపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించా రు. టాస్క్‌ఫోర్స్ సీఐ తిరుపతి, ఎస్సై వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles