ఆర్థిక గణనపై అవగాహన కలిగి ఉండాలి

Sat,August 24, 2019 03:01 AM

ములుగు, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఉన్న ప్రజల జీవన ప్రమాణా లు తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించేందుకు ప్ర తీ ఐదేళ్లకు ఒకసారి చేపట్టనున్న ఆర్థిక గణన సర్వేపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా చీఫ్ ప్లా నింగ్ ఆఫీసర్ వెంకటరమణ తెలిపా రు. ఈ మేరకు ఆయన జిల్లా కేంద్రం లో ఆర్థిక గణనపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇం టింటికీ తిరిగి సర్వే చేసేందుకు 47 మంది సూపర్‌వైజర్లు, 155మంది ఎ మ్యూనేటర్లను నియమించినట్లు తెలిపారు. ఈ సర్వేను వచ్చే నెల 2వ వా రంలో ప్రారంభించి ఆరు మాసాలపా టు నిర్వహించాలని తెలిపారు. గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లో జీవిస్తున్న వారి జీవన ప్రమాణాలను తెలుసుకునేందు కు ప్రతీ ఐదేళ్లకు ఒక సారి ఈ సర్వేను చేపట్టనున్నట్లు తెలిపారు. మొట్టమొదటి సారిగా ఈ సర్వేను మొబైల్ యా ప్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సర్వే ద్వారా ప్రతీ ఇంటికి ఎమ్యూనేటర్లు వెళ్లి సర్వే చేసి ఆయా కుటుంబా ల వివరాలను మొబైల్‌లో గల ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆయా కుటుంబాలు జీవించేందుకు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నా రు..?, ఉద్యోగాలు చేస్తున్నారు.?, వా రు ఎలాంటి ఉపాధి పొందుతున్నా రు..? ఆదాయ వనరులు ఏమిటి? అ నే తదితర అంశాలను ఈ సర్వేలో గు ర్తించాలని అన్నారు. ఈ సర్వే ఆధారం గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తీర్చేందుకు కావాల్సిన సబ్సిడీ పథకాలు, అభివృద్ధి ప్రణాళిక లు రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ సర్వే బాధ్యతలను కేంద్ర ప్రభు త్వం కామన్ సర్వీస్ సెంటర్‌కి అప్పగించినట్లు ఆయన తెలిపా రు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సీఎస్‌ఈ కోఆర్డినేటర్ రేపల్లా మాధురి, బీఎల్‌ఈలు శ్రీనివాస్, రాజేందర్, రా జు, మహేందర్, రామకృష్ణ పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles