సురక్షితంగా ఒడ్డుకు చేరిన గొర్రెలు

Tue,September 10, 2019 02:35 AM

పలిమెల, సెప్టెంబర్ 9: పంకెన గ్రామంలో మేతకు వెళ్లిన 500 గొర్రెలు, ముగ్గురు కాపలాదారులు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరి అండు (మధ్యలో) వరద నీటిలో ఆదివారం చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో కాటారం ఏఎస్పీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టి 160 గొర్రెలు, ముగ్గురు కాపరులను ఆదివారం సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. మిగతా గొర్రెలను సోమవారం ఒడ్డుకు చేర్చారు. ఆదివారం మేతకు వెళ్లిన గొర్రెలు గోదావరి అండులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. స్పందించిన కాటారం ఏఎస్పీ ఆదివారం మహారాష్ట్రలోని సిరొంచ సోమునూరు పోలీసుల నేతృత్వంలో ఇంజిన్ పడవ, రెస్క్యూ టీం సాయంతో ముగ్గురు కాపలాదారులను ఒడ్డుకు తీసుకొచ్చారు.

160 గొర్రెలను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. రాత్రి కావడంతో రెస్క్యూ టీం సభ్యులు వెళ్లిపోయారు. మిగిలిన గొర్రెలను సోమవారం ఉదయం సిరొంచలోని సోమునూరు ఫారెస్ట్ అధికారులు, రెస్క్యూ టీం, ఇంజిన్ పడవ సాయంతో ఒడ్డుకు చేర్చారు. కాగా, సహాయక చర్యలు చేపట్టిన ఏఎస్పీ సాయిచైతన్యకు గొర్రెల కాపలాదారులు కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట మహదేవపూర్ సీఐ నర్సయ్య, పలిమెల ఎస్సై తిరుపతి, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles