పకడ్బందీగా యూరియా పంపిణీ

Tue,September 10, 2019 02:35 AM

ములుగు, నమస్తే తెలంగాణ: జిల్లాలో రైతులకు పకడ్బందీగా యూరియా పంపిణీ చేస్తామని డీఏవో గౌస్ హైదర్ తెలిపారు. యూరియాను కృత్రిమ కొరత స్పష్టించకుండా, బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన సిబ్బందితో కలిసి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులకు సరఫరా చేసిన యూరియా వివరాలు, అమ్మకం, నిల్వ వివరాల రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గౌస్‌హైదర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం యూరియా కొరత లేకుండా సరఫరా చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాకు సోమవారం 200 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసిందని వివరించారు.

ఇందులో భాగంగా 105 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రైవేటు డీలర్లకు, 95 మెట్రిక్ టన్నుల యూరియాను సొసైటీలకు పంపిణీ చేసినట్లు వివరించారు. ములుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం ఒకే రోజు రైతులకు 1200 బస్తాలను అందించినట్లు తెలిపారు. 1100 బస్తాలను రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు అధిక ధరలకు యూరియాను విక్రయించకూడదని, విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి మునుకుంట్ల సంతోశ్ తదితరులు ఉన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles