బాలల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తాం

Tue,September 10, 2019 02:36 AM

కలెక్టరేట్, సెప్టెంబర్ 09: బాలల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఎన్‌సీపీసీఆర్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో ఈ నెల 13వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న ఎన్‌సీపీసీఆర్ బెంచ్ (క్యాంపు) గురించి వివిధ శాఖల అధికారులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌సీపీసీఆర్ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన తాము జయశంకర్‌భూపాలపల్లి జిల్లాకు వస్తామన్నారు. 12వ తేదీన మధ్యాహ్నం జిల్లాలోని అధికారులతో సమావేశమవుతామన్నారు. 13వ తేదీన ఉదయం 9 నుంచి సా యంత్రం 5 గంటల వరకు బాలల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఇన్‌చార్జి సంక్షేమాధికారి శైలజ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ రకాల సమస్యల మూలంగా తమ హక్కులు ఉల్లంఘనకు గురవుతున్న బాలలు, వారి తరుఫున వారి తల్లిదండ్రులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బాలల సమస్యల పై ఈ నెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం పక్కన గల ఇల్లందు క్లబ్ హౌస్‌లో నిర్వహించనున్న ఎన్‌సీపీసీఆర్ బాలల కోర్టులో ఫిర్యాదులు అందించాలని కోరారు. కార్యక్రమంలోఏఎస్పీ రాజమహేంద్రనాయక్, డీఈవో నారాయణరెడ్డి, డీఎంహెచ్‌వో గోపాలరావు, డీఎండబ్ల్యూవో వెంకటేశ్వర్లు, సీడబ్ల్యూసీ మెంబర్లు కే మంజూల, బాలరాజు, చైల్డ్‌లైన్ ఐసీపీఎస్ సిబ్బంది వెంకటస్వామి పాల్గొన్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles