క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

Tue,September 10, 2019 02:36 AM

కలెక్టరేట్, సెప్టెంబర్ 09: సింగరేణి సంస్థ ప్రభుత్వానికి అప్పగించిన స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న వారు ఇంటి స్థలాన్ని వారి పేరు పై క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకే ఇంటి స్థల క్రమబద్ధీకరణకు గడువు ఉందన్నారు. ఈ నేపథ్యంలో మరో సారి ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు సెప్టెంబర్ 30వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో htt:// Irms76.cgg.gov.in:8080/go76 Applications.do వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారుడి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, భర్త, భార్య ఆధార్‌కార్డు, వార్డు నంబర్, భూమి విస్తీర్ణం, భూమికి సంబంధించిన పేపర్లు, ఇంటి పన్ను, కరెంటు బిల్లులతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

100
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles