ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి : ఏఎస్పీ శరత్‌చంద్రపవార్‌

Wed,September 11, 2019 02:08 AM

ఏటూరునాగారం, సెప్టెంబర్‌ 10 : ప్రజలు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని, ఎలాంటి జబ్బులపై కూడా నిర్లక్ష్యం చే యకుండా వైద్యులను సంప్రదించి చికి త్స పొందాలని స్థానిక ఏఎస్పీ శరత్‌ చం ద్ర పవార్‌ కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆధ్వర్యంలో కన్నాయిగూడెం మండలం చి ట్యాలలో పోలీసులు మంగళవారం వై ద్యశిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని ప్రారంభించిన ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడంలో భాగంగా మారుమూల గ్రామాల్లో పోలీసుల తరపున వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలపై పోలీసులు ప్రేమానురాగాలతోనే ఉంటారని, ఫ్రెండ్లీ పోలీ సు నడుస్తుందని ఆయన వివరించారు. యువత చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని, యువతకు మంచి భవిష్యత్‌ ఉందని ఏఎస్పీ అన్నారు. ఈ శిబిరంలో చిట్యాల, మల్కపల్లి, ఐలాపూర్‌, భూపతిపూర్‌ గ్రామాలకు చెందిన సు మారు 400మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా రూ.81వేల విలు వ చేసే మందులను పంపిణీ చేశారు. అ నంతరం ఎనిమిది గొత్తికోయ గుంపుల్లో ఉన్న యువతకు వాలీబాల్‌ కిట్స్‌ అం దించారు. యువత సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ నాగబాబు, ఎస్సై శ్రీకాంత్‌, వైద్యు లు నిర్మల, నవీన్‌, ఆర్‌ఎంపీ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles