గణేశ్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

Wed,September 11, 2019 02:09 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : విఘ్నాలు తొలగించే గణనాథుడికి భక్తి శ్రద్ధలతో భక్తులు నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి పర్వదినం రోజు ప్రతిష్ఠించిన వినాయకుకి వేదపండితుల మంత్రోశ్ఛరణల మధ్య భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నేడు (బుధవారం) గణేశ్‌ నిమజ్జనం జరుగనుంది. ఇందులో భాగంగా, జిల్లా అధికార యంత్రాంగం నిమజ్జనం సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రధానంగా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. జిల్లావ్యాప్తంగా 690 గణేశ్‌ విగ్రహాలను ప్రతిష్ఠాపన చేసి పూజలు నిర్వహించారు. జిల్లాలోని గణేశ్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, భక్తులు గణనాథుల నిమజ్జనానికి జిల్లాలోని కాళేశ్వరం, గణప సముద్రంతోపాటు ము లుగు జిల్లాలోని రామప్ప, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు వాహనాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. బుధవారం ఉదయం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనానికి వాహనాల్లో భక్తులు తరలివెళ్లనున్నారు. ప్రధానంగా జిల్లాలో నిమజ్జన కేంద్రాలు గా కాళేశ్వరం, గణపురం మండల కేంద్రంలోని గణప సముద్రంలను గుర్తించారు. ఈ రూట్లలో ట్రాఫిక్‌ స్తంభించకుండా పోలీసుశాఖ ముందస్తు చర్యలను తీసుకుంది. నిమజ్జనానికి ఎంత మంది వెళ్తున్నాం, తిరిగి వస్తున్న సమయంలో ఎంత మంది ఉన్నామనే విషయాన్ని తప్పనిసరిగా చూ సుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్‌ భాస్కరన్‌ ఉత్సవ కమిటీలకు సూచించిన విషయం విదితమే. జిల్లా లో ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుం డా పోలీసు సిబ్బందిని ఎక్కువ సంఖ్యలో నియమించారు. గణేశ్‌ ఉత్సవ కమిటీలకు కూడా పలు సూచనలు ఇదివరకే చేశారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోకుండా కండీషన్‌లో ఉన్న వాహనాల్లోనే గణనాథులను నిమజ్జనానికి తరలించాలని, చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో తగుజాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఊరేగింపులో డీజేలు వాడవద్దని, బాణాసంచా కాల్చవద్దనే నిబంధనలు పెట్టారు. ఇదిలా ఉండగా, జిల్లాలోని గణనాథులను ఘనంగా ఊరేగింపుగా తీసుకుపోవడానికి అవసరమైన ఏర్పాట్లను ఉత్సవ కమిటీల నిర్వాహకులు సిద్ధం చేసుకున్నారు. నిమజ్జన ప్రాంతాలైన కాళేశ్వరం, గణపసముద్రం వద్ద గజ ఈతగాళ్లను కూడా అధికార యంత్రాం గం అందుబాటులో ఉంచింది. ట్రాఫిక్‌ జామ్‌ కా కుండా పోలీసు గస్తీ బృందాలు గస్తీ నిర్వహించనున్నాయి. ఓవర్‌టేక్‌ చేయకుండా క్రమ పద్ధతి లో వాహనాలు వేగ నియంత్రణలో ఉండే విధం గా వాహన చోదకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఉత్సవ కమిటీల సన్మానానికి ఏర్పాట్లు..
వివిధ ప్రాంతాల నుంచి భూపాలపల్లి మీదు గా కాళేశ్వరం, గణపసముద్రం, భద్రాచలం, రా మప్ప ప్రాంతాలకు గణనాథులను తీసుకువెళ్లే గణేశ్‌ ఉత్సవ నిర్వాహకులను ఘనంగా సన్మానించడానికి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ సెం టర్‌, గణేశ్‌చౌక్‌ వద్ద వేర్వేరుగా ఉత్సవ సన్మాన వేదికలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా గణేశ్‌చౌక్‌, అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉత్సవ నిర్వాహకులను ఈ రెండు చోట్ల ఏర్పాటు చేసిన సన్మాన ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానిస్తారు. ఈ సంవత్సరం కూడా బుధవారం జరిగే గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా పై రెండు సెంటర్లలో సన్మాన ఉత్స వ కమిటీలు సన్మానానికి అవసరమైన వేదికలను మంగళవారం రాత్రి నుంచి సిద్ధం చేస్తున్నాయి.

3000వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్నట్లు అంచనా
కాళేశ్వరం : కాళేశ్వరం వద్దకు జిల్లా వ్యాప్తంగా 690వినాయక విగ్రహాలు, వరంగల్‌, హైదరాబాద్‌ తదితర జిల్లాల నుంచి సుమా రు 3000వేల వి గ్రహాలు నిమిజ్జనానికి వస్తాయని పోలీసులు అం చనా వేస్తున్నారు. కాళేశ్వరం అంతర్‌రాష్ట్ర వంతె న వద్ద నిమజ్జన ప్రదేశం ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా కాళేశ్వరం వద్ద ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరుగకుండా కాటా రం ఏఎస్పీ సాయిచైతన్య ఆధ్యర్యం లో ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం వద్ద ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 120మంది కా నిస్టేబుళ్లు, మహారాష్ట్ర పోలీసు లు, సీఆర్పీఎఫ్‌, హోంగార్డులు విధులు నిర్వమించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక వ్యూపాయింట్‌ ఏర్పాటు చేశారు. కాళేశ్వరం వద్దకు వచ్చే భక్తులు వినాయకుడిని తెచ్చే వాహనం తో మాత్రమే అంతర్‌రాష్ట్ర వంతన వద్దకు రావాలని తెలిపారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా జిల్లాలోని మద్యం దుకాణాలను మంగళవారం ఉదయం 10గంటల నుంచి గురువారం ఉదయం 10గంటల వరకు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీం తో జిల్లాలో మద్యం దుకాణాలను మూసివేశారు. రాత్రి 11 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం పూ ర్తి చేయాలని పోలీసులు కమిటీలకు సూచించారు.
ఏర్పాట్లు పరిశీలించిన జెడ్పీ చైర్‌పర్సన్‌..
కాళేశ్వరం అంతర్‌రాష్ట్ర వంతెన వద్ద వినాయ క నిమజ్జన ఏర్పాట్లను జిల్లా జెడ్పీచైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి మంగళవారం సాయంత్రం పరిశీలించా రు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు రాకుండా చూడాలని ఆల య అధికారుల కు, పోలీసులకు సూచించారు. అలాగే, మహదేవ పూర్‌ సీఐ నర్సయ్య, ఎస్సై శ్రీనివాస్‌, సర్పంచ్‌ వసంత, ఈవో మారుతి కూడా ఏర్పాట్లను పరి శీలించారు.

ప్రశాంతంగా నిర్వహించేందుకు..కాటారం ఏఎస్పీ సాయిచైతన్య
జిల్లాతోపాటు, వివిధ జిల్లాల నుంచి కాళేశ్వరం వద్దకు నిమజ్జనం నిమిత్తం వచ్చే గణనాథులను ప్రశాంతంగా నిమిజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. మండప నిర్వాహకులతో ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి నిబంధనలు చెప్పాం. నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్స్‌పై నిషేధం వి ధించాం. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీ సుకుంటాం. నిర్ణీత స మయానికి మండపాల నుంచి శోభాయాత్రతో బయలుదేరాలి. ప్రజలు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles