జంపన్నవాగులో పడి భక్తుడి గల్లంతు

Thu,September 12, 2019 03:09 AM

తాడ్వాయి, సెప్టెంబర్ 11 : మండలంలోని మేడారం జంపన్నవాగులో పడి భక్తుడు గోవింద మల్లేషం(20) బుధవారం సాయంత్రం గల్లంతయ్యాడు. స్థానికులు, అతడి స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం. జనగామ జిల్లాలోని చెల్పూర్‌కు చెందిన మల్లేషం కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు తన స్నేహితులతో కలిసి మేడారం వెళ్లారు. స్నానాలు చేసేందుకు రెడ్డిగూడెం సమీపంలోని లోలెవల్ కాజ్‌వే వద్దకు చేరుకోగా అతడి స్నేహితుడు సరదాగా మల్లేషంను నీటిలోకి నెట్టివేశారు. కాగా, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మల్లేషం కొట్టుకుపోయాడని, స్నేహతులు అతడి కోసం గాలించినా ఆచూకీ లభించలేదని తెలిపారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles