అధికారులు అంకితభావంతో పనిచేయాలి

Fri,September 13, 2019 03:56 AM

- కలెక్టర్ నారాయణరెడ్డి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధ్దే ధ్యేయంగా అధికారులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమ అమలులో భాగంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరును తెలుసుకునేందుకు గురువారం అధికారులతో కలెక్టర్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో శ్రమదాన కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టి అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలలో స్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలను 100శాతం చేపట్టాలని ఆదేశించారు. క్లియర్‌గా ఉన్న స్థలాలను వెంటనే పనులను ప్రారంభించి.. వారం రోజుల్లోగా పూర్తి స్థాయిలో పనులు జరిగే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వివాదస్పద భూములు ఉన్నట్లయితే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ భూముల సమస్యలు ఉంటే గ్రామ సభలు నిర్వహించి ఫారం-ఏ ద్వారా అటవీ శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.

శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులకు గుర్తించిన భూములలో ఎన్ని వివాద రహితంగా ఉన్నాయి..? ఎన్ని వివాదస్పదంగా ఉన్నాయో? కలెక్టర్ అధికారులను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. వివాద రహితంగా ఉన్న భూముల్లో వెంటనే పనులను చేపట్టి నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు. నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేయడానికైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. రాళ్లు రప్పలు ఉన్న భూములను జేసీబీలతో శుభ్రం చేయించాలని, వాటికి నిధులు తానే స్వయంగా అందిస్తానన్నారు. భూ సమస్యలకు సంబంధించిన విషయంలో ఎంపీడీవోలు చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. మంగపేట మండలంలో 30 రోజుల ప్రణాళిక అమలుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని మండలాల ఎంపీడీవోలు స్మశాన వాటిక, డంపింగ్ యార్డుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు వివరించారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజలు శ్రమదానంలో పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో విషజ్వరాలు ప్రభలకుండా పారిశుధ్య కార్యక్రమాలను విస్త్రృతంగా చేపట్టాలని ఆదేశించారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles