ఇసుక దళారులను ఉపేక్షించేది లేదు

Sat,September 14, 2019 02:07 AM

ఏటూరునాగారం, సెప్టెంబర్ 13 : ఆదివాసీల మధ్య ఇసుక క్వారీలకు కోసం చిచ్చు పెట్టే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ హెచ్చరించారు. మండలకేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండలంలోని రాంపూర్, ముల్లకట్ట, వెంకటాపురం మండలం కొండాపూర్, సూరవీడు, ఎదిర తదితర గ్రామాల్లో ఆదివాసీ ఇసుక సొసైటీలకు చెందిన మహిళలు జగదీశ్వర్‌తో మాట్లాడారు. దళారులతో ఎదురువుతున్న ఇబ్బందులను జగదీశ్వర్ దృష్టికి తీసుకుపోయారు. దీంతో తీవ్రంగా స్పందించిన జగదీశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక సొసైటీ స భ్యులను బెదిరింపులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని ప్రజలు, సొసైటీలకు లాభదాయకంగా ఉండే విధంగా రూపొందించిందని ఆయన తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో ఆదివాసీల మధ్యచిచ్చు పెట్టే వారిపై పీడీయాక్టు కింద కేసులు పెట్టించడానికి కూడా తాను వెనకాడేది లేదని స్పష్టంచేశారు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు మహేశ్, నాయకులు తు మ్మ మల్లారెడ్డి, గడదాసు సునీల్ కుమార్, చింతర వి, రామనాధం, విశ్వనాథం, కొప్పుల నర్సింగారా వు, వావిలాల మోహన్, బీ ప్రవీణ్ పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles