అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం : జెడ్పీ చైర్మన్

Sat,September 14, 2019 02:07 AM

తాడ్వాయి, సెప్టెంబర్ 13 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసు మ జగదీశ్వర్ అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వం పంపి ణీ చేసిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి జగదీశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జెడ్పీ వైస్‌చైర్మన్ నాగజ్యోతి, ఎంపీపీ గొంది వాణిశ్రీలతో కలిసి ఆయన లబ్ధిదారులకు చేపపిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల కోరిక మేరకు మరో రెండు లక్షల చేప పిల్లలను త్వరలోనే అందజేస్తామని తెలిపారు. మండలప్రత్యేక అధికారి సంజీవరావు, ఎంపీడీవో సత్యాంజనేయప్రసాద్, ఉపసర్పంచ్ ఆలేటి ఇంద్రారెడ్డి, నాయకులు మోహన్‌రావు, శివయ్య, జైపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రజినీకర్‌రెడ్డి పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles