రఘుపతికి పీవోగా అదనపు బాధ్యతలు

Sat,September 14, 2019 02:08 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను ప్రతి ఏటా పెంచి ఆ లక్ష్య సాధన కోసం నూతన గనులను చేపట్టి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ త్వరలో చేపట్టబోయే వెంకటాపూర్ బ్లాక్-1 ప్రాజెక్టు ఆఫీసర్‌గా భూపాలపల్లి ఏరియా ఎస్‌వో టు జీఎం జీ రఘుపతికి అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రధానంగా భూపాలపల్లి ఏరియాలో ఓపెన్‌కాస్టు గనుల తవ్వకం, బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత పురోగతిలో ఎస్‌వో టు జీఎం రఘుపతి నాడు ప్రాజెక్టు ఆఫీసర్‌గా ముఖ్య భూమిక పోషించారు. ఆ రెండు ఓపెన్‌కాస్టు గనులు పీవోగా రఘుపతి ఉన్న హయాంలో లాభాలను గణనీయంగానే అర్జించాయి. త్వరలోనే వెంకటాపూర్ బ్లాక్-1 నూతన ఓపెన్‌కాస్టు గనిని చేపట్టడానికి సింగరేణి సంస్థ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. దీనికి ప్రాజెక్టు ఆఫీసర్‌గా రఘుపతికి అదనపు బాధ్యతలను అప్పగించింది.

భూపాలపల్లి ఏరియాలోనే ప్రప్రథమంగా చేపట్టిన కేటీకే ఓపెన్‌కాస్టు సెక్టార్-1 ప్రాజెక్టు గని మేనేజర్‌గా 2016 సంవత్సరంలో రఘుపతి పని చేశారు. తదనంతరం 2017 జూన్‌లో ప్రాజెక్టు ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. 2018 జూన్ వరకు కేటీకే 1, 2 ఓపెన్‌కాస్టు గనుల పీవోగా కొనసాగారు. ఆ సమయంలో ఓపెన్‌కాస్టు గనుల తవ్వకానికి అవసరమైన భూ సేకరణకు సంబంధించిన భూ యజమానులతో చర్చించి భూమిని సేకరించడం, మట్టి తవ్వకాలు, బొగ్గు ఉత్పత్తిలో పురోగతి సాధించడంలో ముఖ్య భూమిక పోషించారు. దీంతో కేటీకే లాంగ్‌వాల్ సమీపంలో సింగరేణి సంస్థ నూతనంగా చేపట్టిన ఓపెన్‌కాస్టు-3 గనికి అవసరమైన భూ సేకరణలో సైతం కీలక పాత్ర పోషించారు. ఈ అనుభవాల దృష్ట్యా తాజాగా సింగరేణి యాజమాన్యం భూపాలపల్లి ఏరియా ఎస్‌వో టు జీఎం రఘుపతికి వెంకటాపూర్ బ్లాక్-1 ప్రాజెక్టు ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles